రాజమండ్రి సెంట్రల్ జైలులో స్కామ్ స్టర్ చంద్రబాబును కస్టడీలో తీసుకున్న ఏపీ సీఐడీ అధికారులు 2 రోజుల పాటు స్కిల్ స్కామ్‌పై విచారణ జరుపనున్నారు..ఇదిలా ఉంటే..స్కిల్ స్కీమ్‌లో రూ. 371 కోట్ల అవినీతి జరిగిందని విచారణలో గుర్తించిన ఏపీ సీఐడీ..ఈ మేరకు నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడలోని ఏసీబీ కోర్డులో రిమాండ్ నిమిత్తం హాజరుపర్చారు..అయితే అసలు స్కిల్ స్కామ్‌లో అవినీతి జరగలేదని, ఎఫ్‌ఐఆర్‌లో బాబు పేరులేదు కాబట్టి…ఈ కేసును కోర్టు విచారణకు తీసుకోకుండా కొట్టేస్తుందని..అసలు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి జడ్జి ఈ కేసును కొట్టేస్తుంది..బాబుగారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటూ..టీడీపీ నేతలు, పచ్చమీడియా ఛానళ్లు ఆరోజు సాయంత్రం వరకు నానా రచ్చ చేసాయి..రకరకాల వితండ వాదనలు తెరపైకి తీసుకువచ్చి..మరి కొద్ది గంటల్లో బాబుగారు బయటకు వచ్చేస్తున్నారంటూ హోరెత్తించారు..
అయితే సాయంత్రానికి సీన్ మారింది..పక్కా ఆధారాలతో ఏపీ సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్లు, ఏఏజీ సుధాకర్ రెడ్డి పొన్నవోలు వాదనలతో ఏకీభవించిన జడ్జి హిమబిందు…ఎన్ని వత్తిళ్లు వచ్చినా లొంగకుండా…చట్ట ప్రకారం..చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు..బాబుగారికి జైలు లేదు..బెయిలు లేదు..అంటూ పొద్దుటి నుంచి హడావుడి చేసిన టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఛానళ్ల బాసులు దెబ్బకు ఖంగుతిన్నారు…ఇక అంతే…మా నిప్పునాయుడినే జైలుకు పంపిస్తారా అంటూ పచ్చమూకలు జడ్జి హిమబిందును బూతులు తిడుతూ..సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారు..ఇక బుద్ధా వెంకన్న లాంటి బుద్ధి లేని టీడీపీ నేతలైతే అసలు జడ్జి హిమబిందుకు తీర్పుకు ముందు ఫోన్ కాల్ వచ్చింది..ఆ కాల్ డేటా అంతా బయటపెట్టాలి అంటూ జడ్జి హిమబిందులపై కారుకూతలు కూసాడు..ఇక పచ్చమూకల పైత్యానికి హద్దే లేకుండా పోయింది..జడ్జి హిమబిందుఫోటోలను పోస్ట్ చేస్తూ..అసభ్యకరంగా దూషిస్తూ..పోస్టులు పెట్టారు..అయితే న్యాయ ప్రకారం తన డ్యూటీ తాను నిర్వర్తించిన జడ్జి హిమబిందుపై పచ్చ మూకల పైశాచిక దాడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి..
తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ..జడ్జి హిమబిందులపై టీడీపీ నేతల వేధింపులపై రాష్ట్రపతి భవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ అందింది. రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా.. జవహర్ రెడ్డికి లేఖ రాశారు. కాగా చంద్రబాబు కేసులో భాగంగా అడిషనల్ సెషన్స్ జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు వెళ్లింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్ రామానుజరావు ఈ-మెయిల్ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును రిమాండ్‌కు పంపించిన తర్వాత హిమబిందు వ్యక్తిగత జీవితంపై టీడీపీ నేతలు వివాదస్పదంగా వ్యవహరించారు. హిమబిందు వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని రామానుజరావు తన ఫిర్యాదు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రామానుజరావు ఫిర్యాదు రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ రాసింది. జడ్జి హిమబిందుకు సంబంధించిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని జవహర్‌రెడ్డికి పీసీ మీనా లేఖ రాశారు. జడ్జి హిమబిందును సోషల్ మీడియాలో అసభ్యంగా దూషిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతి భవన్..ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది..ఈ నేపథ్యంలో పోలీసులు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాల అసభ్యకరంగా దూషిస్తున్న పచ్చమూకలను గుర్తించి..వారి బెండు తీసేందుకు సిద్ధమవుతున్నారు..ఇక తమ్ముళ్లకు దబిడిదిబిడే..!