తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోగా, ప్రస్తుత అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తనకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.శుక్రవారం జరిగిన రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సైతం ఆమె దూరంగా ఉన్నారు.
ఈ క్రమంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ పంపించారు. నేడో రేపో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.