తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన పరకాల నియోజకవర్గ బీ.ఆర్. ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడేనాటికి పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం మీద సీలింగ్ ఉండేదని.మనిషికి 5 కిలోల చొప్పున గరిష్టంగా ఇంటికి 20 కిలోలు మాత్రమే ఇచ్చే వారు..
సీఎం కేసీఆర్ ఆ సీలింగ్ ఎత్తివేయడమే కాకుండా మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తామన్నారు. ఈ సారి గెలిచిన తర్వాత అన్నపూర్ణ పథకం క్రింద తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి నాణ్యమైన సన్న బియ్యం ఇస్తామని ప్రకటించారు.గడిచిన పది సంవత్సరాలుగా నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసుకున్నామని,గత పాలకులు నియోజకవర్గంలో కల్లోలాలు, విద్వేషాలు తో నడిపించారు..
కానీ గడిచిన పది సంవత్సరాలుగా నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని తెలిపారు.మరోసారి కారు గుర్తుకు వేటువేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు..