తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని, ఎంతో మంది సీఎంలు వచ్చినా ఎవరికీ ఇలాంటి ఆలోచన రాలేదన్నారు.
కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. యాదాద్రిని దేశంలోనే ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణలు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.సీఎం కేసీఆర్ గారి పాలనలో ఇంతకుముందు లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి మరింత అద్భుతంగా సాగుతోందని అన్నారు.