మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగమంతా అలెర్ట్‌గా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశముందని.. నీరుపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని రివ్యూ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.