అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం రోజు తన అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు సీనియర్ నటి మీనా. ఇందుకు సంబంధించిన ఓ ప్రకటనను మీనా ఆదివారం విడుదల చేశారు. తన భర్త మృతి తనకు తీరని లోటని తెలిపారు.
Read More »బండి సంజయ్ పాదయాత్రలో గొడవ.. పలువురికి గాయాలు
జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీకి చెందిన యువకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ బండి సంజయ్‌ను మండలంలోకి ఆహ్వానించారు. అనంతరం బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరకీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని సంజయ్ అన్నారు. దీంతో అక్కడ ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో గొడవ దిగారు. ఈ …
Read More »స్వాతంత్ర దినోత్సవం నాడు సెలబ్రిటీలు ఏమన్నారంటే..!
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల కావడంతో దేశవ్యాప్తంగా జాతీయ పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. నేడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఎవరు ఏమని చెప్పారంటే.. దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా ఇంటి ముందు గర్వంగా రెపరెపలాడుతున్న మన త్రివర్ణ జాతీయ పతాకం. – చిరంజీవి ప్రతి ఒక్కరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. …
Read More »ఆస్కార్ అవార్డ్ రేసులో RRR.. బెస్ట్ యాక్టర్ ఎవరంటే..
ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. త్వరలో ఈ మూవీ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల్లోనూ సత్తాచాటనుందని ఓ ఫేమస్ హాలీవుడ్ మ్యాగజైన్ పేర్కొంది. ఇదే కాకుండా ఏకంగా నాలుగు కేటగిరిల్లో RRR పోటీ పడునుంది అంటూ స్టోరీ ప్రచురించింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేటగిరిల్లో.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించి బెస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్ నామినేట్ కానున్నారట. అంతేకాకుండా …
Read More »బాబాయ్‌గా అదే నేను నీనుంచి కోరుకుంటున్నా: బాలకృష్ణ
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన బింబిసార సక్సెస్‌పై బాలకృష్ణ స్పందించారు. సినిమా అద్భుతంగా ఉందని ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించినందుకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు. మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ వశిష్ఠ్‌కి తనని తాను ఫ్రూవ్ చేసుకున్నావని త్వరలో మనం కలిసి పనిచేద్దాం అని అన్నారు బాలయ్య. కొత్త వారికి గొప్ప అవకాశాలిచ్చిన ఘనత తమ కుటుంబానికే దక్కుతుందని చెప్పారు. ఇలాంటి మరిన్ని సినిమాలను నువ్వు అందించాలని అదే నేను …
Read More »రూ.80లక్షల కోట్ల అప్పు.. ఎవర్ని ఉద్దరించారు?: కేటీఆర్ ఫైర్
దేశ సంపదను పెంచే తెలివితేటలు ప్రధాని మోదీ ప్రభుత్వానికి లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. సంపదను పెంచి పేదలక సంక్షేమానికి ఖర్చు చేసే మనసు వారికి లేదన్నారు. ఉచిత పథకాలు వద్దంటూ ఇటీవల ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేదల పొట్ట కొట్టేందుకే ఉచిత పథకాలపై చర్చకు తెరతీశారని కేటీఆర్ విమర్శించారు. పేదల …
Read More »ఎల్‌ఐసీ పాలసీదార్లకు గుడ్ న్యూస్..
ఎల్‌ఐసీ పాలసీదారులకు ఇది గుడ్ న్యూస్. ఇప్పటికే రద్దయిన పాలసీలను రెన్యువల్ చేసుకోవడానికి ఎల్‌ఐసీ ఓ మంచి అవకాశం కల్పించింది. కొంత మొత్తంలో ఫైన్‌తో పాలసీలను రెన్యువల్ చేసుకోవచ్చు. కొన్ని కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో ప్రీమియంలు సకాలంలో చెల్లించపోయి పాలసీ రద్దు అయితే అలాంటి వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇది పర్సనల్ పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈనెల 17 నుంచి అక్టోబర్ 21 …
Read More »లవర్‌కి హెచ్‌ఐవీ.. ఆ బ్లడ్ ఎక్కించుకున్న గర్ల్‌ఫ్రెండ్
ప్రియుడు లేదా ప్రియురాలిపై ప్రేమ ఉంటే దాన్ని ఎన్నో విధాలుగా వ్యక్తం చేయొచ్చు. కుటుంబసభ్యులు ఒప్పుకోకపోతే దానికీ ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయినా ఇవేమీ పట్టవన్నట్లు కొంతమంది మూర్ఖంగా వ్యవహరిస్తుంటూ కుటుంబాలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంటారు. అలాంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది. సౌల్‌కుచి జిల్లాకు చెందిన ఓ యువకుడిని ఓ యువతి ప్రేమిస్తోంది. ఫేస్‌బుక్‌లో చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేని విధంగా వారిద్దరూ ప్రేమలో …
Read More »ఆ క్షణం నేను ఎంతో బాధపడ్డా: నాగచైతన్య
తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ సంఘటన తననెంతో బాధపెట్టిందని సినీనటుడు నాగచైతన్య అన్నారు. ఆ సంఘటనతో సినిమాల కోసం థియేటర్‌కు వెళ్లడమే మానేశానని చెప్పారు. ‘లాల్‌సింగ్ చడ్డా’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడారు. ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని తొలి సినిమా ‘జోష్’ ఆడుతున్న థియేటర్‌కు వెళ్లానన్నారు. ప్రేక్షకుల మధ్యే కూర్చొని సినిమా చూశానని.. తనను వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో …
Read More »నేను వెనక్కి తగ్గను.. ఆయన్ను డిస్మిస్ చేయాల్సిందే: కోమటిరెడ్డి
చండూరు సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారీ చెప్పినా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాంతించేలా కనిపించడం లేదు. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించిన తర్వాతే రేవంత్ చెప్పిన సారీపై ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ సారీ చెప్పిన అంశాన్ని మీడియా ప్రతినిధులు కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ విధంగా …
Read More »