టీఆర్ఎస్ పార్టీ ఎంపీ సంతోష్ కుమార్‌కు రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో మరింత కాలం ప్రజాసేవ చేయాలని కేటీఆర్ ఆకాంక్షించారు. థ్యాంక్యూ అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్‌కు ఎంపీ సంతోష్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నా జీవితంలో మీరు నాకు అమూల్యమైన బహుమతి అన్నయ్య అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్
మద్యం మత్తులో పోలీసులతో దురుసుగా మాట్లాడిన ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువకుడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్ కుమారుడు ఫయాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఫయాజ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పీకల దాకా మద్యం సేవించిన ఫయాజ్ ఆదివారం రాత్రి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా హెడ్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న …
Read More »వరద సాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లొద్దు : GHMC కమిషనర్
వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని పేర్కొన్నారు. బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధ్రువీకరణ జరుగుతోందని, తర్వాత వారి అకౌంట్‌లోనే నేరుగా వరద సాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈ నెల 7వ తేదీ నుంచి వరద సహాయం …
Read More »సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అంటున్న హాట్ బ్యూటీ
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జాంబీరెడ్డి. చైల్డ్ యాక్టర్ తేజ సజ్జా ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మధ్య కాలంలో పక్క రాష్ట్రాల హీరోయిన్లు తెలుగు ప్రేక్షకులను పలుకరిస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఆ సుందరి ఎవరనుకుంటున్నారా..? జాంబీరెడ్డి చిత్రంతో మహారాష్ట్ర బ్యూటీ దక్షా నగార్కర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు …
Read More »అలియాభట్ తెలుగులోకి ఎంట్రీ
బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌లో అలియాభట్ జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘నిరీక్షణకు తెరపడింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ కోసం హైదరాబాద్‌కు చేరుకున్నా’ అని అలియాభట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. …
Read More »ఖమ్మంలో ఐటీ టవర్
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ పరిశ్రమ క్రమంగా జిల్లాలకు విస్తరిస్తున్నది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఐటీ హబ్‌లో భాగంగా అత్యాధునిక హంగులతో ఈ ఐటీ సౌధాన్ని నిర్మించారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్‌ను రూ.27 కోట్ల …
Read More »నిహారికకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్
మెగా వారింట్లో పెళ్లి.. అక్కడున్నది మెగా డాటర్.. మరి వాళ్ళింట్లో పెళ్లి జరుగుతున్నపుడు గిఫ్టులు ఎలా ఉంటాయి..? మన ఊహకైనా అందుతాయా..? ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయ్‌పూర్ కోటలో ఈమె పెళ్లి డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డతో జరగబోతుంది. ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబంలోకే తన తమ్ముడు కూతురును పంపిస్తున్నాడు చిరంజీవి. ఇదిలా ఉంటే నిహా పెళ్లి కోసం మెగా …
Read More »నూతన కార్పొరేటర్లతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్పొరేటర్లతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 55 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ల విధులు, ఇతర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మేయర్ పదవిపై ఎలాంటి వైఖరి అవలంభించాలనే అంశంపై చర్చించనున్నారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి …
Read More »సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్
సిద్దిపేట జిల్లాకు రాష్ర్ట ప్రభుత్వం ఐటీ టవర్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రూ. 45 కోట్లతో కొండపాక మండలం దుద్దెడ గ్రామం వద్ద ఈ ఐటీ టవర్‌ను నిర్మించనున్నారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, టూరిజం హోటల్ మధ్యలో రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. మంత్రి హరీష్ రావు హర్షం సిద్దిపేట …
Read More »తెలంగాణలో కొత్తగా 622 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 622 కరోనా కేసులు నమోదైయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో 2,73,341కు కరోనా కేసులు చేరగా 1,472 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 8,125 యాక్టివ్ కేసులు ఉండగా 2,63,744 మంది రికవరీ అయ్యారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 104 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.
Read More »