Home / BUSINESS (page 3)

BUSINESS

బంగారం ప్రియులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.380 తగ్గి రూ.45,440గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.41,650గా ఉంది. ఇదే సమయంలో వెండి ధర కాస్త పెరిగింది. కేజీపై రూ.100 పెరిగి రూ.71,100గా ఉంది

Read More »

భారీగా పెరిగిన పసిడి ధరలు

అంతర్జాతీయంగా పెరిగిన ధరల ప్రభావంతో దేశంలో కూడా ఇవాళ పసిడి ధరలు భారీగా పెరిగాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.320 పెరిగి రూ. 45,820గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 పెరిగి రూ.42,000గా ఉంది ఇక కేజీ వెండి రూ.900 పెరిగి రూ.71,000గా ఉంది.

Read More »

పెట్రోల్ పై శుభవార్త.

ప్రస్తుతం పెట్రోల్,డీజిల్ పై ధరలు ఆకాశన్నంటుతున్న సంగతి విధితమే. అయితే పెట్రోలు ను జీఎస్టీ  పరిధిలోకి తెస్తే రూ.75కే లీటర్ వస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. అటు డీజిల్ రూ.68కి వస్తుందన్నారు. అయితే ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు. చమురును GST పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు నష్టం కలుగుతుందన్నారు. ఇక వీటిని జీఎస్టీలోకి  తెస్తే కేంద్రం, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందన్నారు.

Read More »

బంగారం ప్రియులకు శుభవార్త

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.1,040 తగ్గి రూ 45,930గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.950 తగ్గి రూ.42,100గా ఉంది. అటు వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.72,000గా ఉంది

Read More »

ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్

ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. రేపల్లెలో ప్రతిరోజూ రాత్రి 10.40కు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7.05కు కాచిగూడ చేరుతుంది. కాచిగూడలో రాత్రి 10.10కి బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 5.50కు రేపల్లె చేరుతుంది. ఈ రైలు పల్లెకోన, భట్టిప్రోలు, వేమూరు, చినరావూరు, తెనాలి, వేజండ్ల, గుంటూరు, బీబీనగర్ ఘట్ కేసర్, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుంది

Read More »

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకోస్తారా..?

ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే… ధరలు నియంత్రణలోకి వస్తాయనే వాదన ఉంది. దీనిపై స్పందించారు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్.. ‘ఈ ప్రతిపాదనకు నేను మద్దతిస్తున్నా. దీనిపై నిర్ణయాధికారం జీఎస్టీ కౌన్సిల్ దే’ అని అన్నారు త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇది రాజకీయాంశంగానూ మారగా.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ఆసక్తిగా మారింది

Read More »

రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ.1,999 విలువైన జియో ఫీచర్ ఫోన్ కొన్న వారికి 24 నెలల పాటు అన్లిమిటెడ్ సర్వీస్ అందిస్తోంది. రూ.1,499కి లభించే మరో ఫీచర్ ఫోన్ కొంటే 12 నెలల సర్వీస్ కల్పిస్తోంది. ఈ రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు నెలకు 2 జీబీ (4G) డేటా వాడుకోవచ్చు. ప్రస్తుతం జియో ఫోన్ …

Read More »

స్వయం ఉపాధివైపు యువత మొగ్గు

స్వయం ఉపాధిని కోరుకునే యువతకు రాష్ట్ర ప్రభు త్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నది. అభిరుచి, అనుభవం, అర్హతలున్న యువత తమ కాళ్ల మీద తా ము నిలబడేందుకు సర్కార్‌ అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వా రా అర్హులైన యువతీ, యువకుల నుంచి సబ్సిడీ రుణా ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్‌ …

Read More »

ఈ వార్త సోషల్ మీడియా వాడే వాళ్లకు మాత్రమే..?

సోషల్ మీడియాలో ఇవి పెట్టకండి వేలిముద్రలు స్పష్టంగా కనిపించేలా విక్టరీ సింబల్ చూపిస్తూ పోజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టకండి విహార యాత్రలకు వెళ్తున్నప్పుడు వివరాలు తెలపకండి పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటివి ఏడాదితో సహా వెల్లడించకండి బహిరంగ వెబ్ సైట్లలో ఫోన్ నంబర్లు ఇవ్వకండి పిల్లల ఫొటోలను పెట్టడం వీలైనంతగా నివారించండి వీటి సాయంతో హ్యాకింగ్లు, ఆన్లైన్ మోసాలు ఇతర నేరాలు జరిగే అవకాశాలు ఎక్కువ

Read More »

వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బంపర్ ఆఫర్

వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బంపర్ ఆఫర్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రిపెయిడ్ కస్టమర్లకు రాత్రి సమయంలో అన్లిమిటెడ్ డేటా ఉచితంగా అందిస్తోంది. రూ.249 ఆపైన అన్లిమిటెడ్ డైలీ డేటా రీఛార్జ్ కు ఇది వర్తిస్తుంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం వరకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఫ్రీ డేటా వాడుకోవచ్చు. డైలీ డేటా కోటా అలాగే ఉంటుంది …

Read More »