Home / BUSINESS (page 2)

BUSINESS

వరుసగా మూడో రోజు పెట్రోల్ మంట

దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వరుసగా మూడో రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో గురువారం లీటర్ పెట్రోలుపై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను చమురు సంస్థలు పెంచాయి. ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై 23 పైసలు పెరగగా.. రూ.94.57కు చేరింది. డీజిల్ ధర లీటరుకు 31 పైసలు పెరగగా.. రూ. 88.77కు ఎగబాకింది.

Read More »

KYC అప్డేట్ పై ఆర్బీఐ కీలక ప్రకటన

అన్ని ప్రభుత్వ ప్రయివేట్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వినియోగదారులు KYC అప్డేట్ తప్పనిసరిగా చేయాలని గతంలో RBI సూచించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్డేట్ చేయడంలో విఫలమైన వినియోగదారులపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను RBI తాజాగా కోరింది. దీంతో డిసెంబర్ 31 వరకు KYC అప్ డేట్ చేసుకోకపోయినా.. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Read More »

మరో 600 ఎకరాలను కొనుగోలు చేసిన మార్క్ జుకర్ బర్గ్

ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దంపతులు హవాయిలో మరో 600 ఎకరాలను కొనుగోలు చేశారు. హవాయిలోని కవాయి ద్వీపంలో ఈ భూమిని 53 మిలియన్ డాలర్లకు (రూ.391 కోట్లు) కొన్నారు. హవాయిలో జుకర్ బర్గ్కు ఇప్పటికే భూమి ఉండగా, ప్రస్తుత కొనుగోలుతో అక్కడ ఆయన భూమి మొత్తంగా 1300 ఎకరాలకు చేరింది.

Read More »

కరోనా ఎఫెక్ట్ – మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాలోని తమ ఫ్యాక్టరీలన్నింటినీ మూసివేయాలని.. తద్వారా ఆక్సిజన్ నిల్వల్ని వైద్య అవసరాల కోసం మళ్లించనున్నట్లు తెలిపింది. మే 1 నుంచి 9 వరకు హర్యానాలోని ఫ్యాక్టరీలను మూసి ఉంచనుండగా.. ప్రజల ప్రాణాల్ని రక్షించడంలో ప్రభుత్వానికి తమ సహకారం నిరంతరం కొనసాగుతుందని మారుతీ హామీ ఇచ్చింది.

Read More »

దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు 9 రోజులపాటు సెలవులు

దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు ఏప్రిల్ నెలలో 9 రోజులపాటు సెలవులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఈ వారంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించింది.మంగళవారం ఏప్రిల్ 13 నుంచి 16వతేదీ వరకు నాలుగురోజుల పాటు వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా బ్యాంకులకు 4రోజులపాటు వరుస సెలవులు …

Read More »

అంబానీలకు రూ.25 కోట్ల జరిమానా

దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఓ కేసులో ముకేశ్, అనిల్ అంబానీతో పాటు వారి భార్యలకు సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించింది. 2000వ సంవత్సరంలో 5శాతం వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు కొందరితో కుమక్కైంది.. పీఏసీ వివరాలు ప్రకటించడంలో విఫలం అయ్యారని సెబీ ఈ సందర్భంగా తెలిపింది. అయితే పెనాల్టీని సంయుక్తంగా లేదా విడిగా అయినా చెల్లించవచ్చని సెబీ వారికి సూచించింది.

Read More »

బ్యాంకులకు 7రోజులు వరుసగా సెలవులు.. ఇందులో నిజం ఎంత..?

బ్యాంకుల్లో ప‌నులు ఉంటే ఈ రెండు, మూడు రోజుల్లోనే చేసేసుకోండి. ఎందుకంటే ఈ నెల 27తో మొద‌లుపెడితే వ‌చ్చే నెల 4 వ‌ర‌కూ బ్యాంకులకు వ‌రుస సెల‌వులు వ‌స్తున్నాయి. శని, ఆదివారాలు, పండ‌గ‌లు, ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపు అంటూ మొత్తం 7 రోజుల పాటు బ్యాంకుల‌కు తాళాలు ప‌డ‌నున్నాయి. మ‌ధ్య‌లో కేవ‌లం మార్చి 30, ఏప్రిల్ 3న మాత్ర‌మే బ్యాంకులు ప‌ని చేస్తాయి. ఈ శుక్ర‌వారంలోపు మీ బ్యాంకు ప‌ని …

Read More »

తగ్గిన బంగారం ధరలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం పసిడి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.45,930కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.42,100గా ఉంది. ఇక వెండి కేజీపై రూ.1000 తగ్గి రూ.71,500గా ఉంది

Read More »

ఇలా చేస్తే రూ.300 తక్కువకు గ్యాస్ సిలిండర్

గత కొన్ని నెలలుగా గ్యాస్ ధర రూ.200 పెరగడంతో సామాన్యులపై గుదిబండలాగా మారింది అయితే, సబ్సిడీ ద్వారా వంట గ్యాస్ సిలిండర్ రూ.300 తక్కువకు లభిస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. గ్యాస్ సిలిండర్ పై కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద సబ్సిడీని రూ.174 నుంచి రూ.312 రూపాయలకు పెంచింది. స్కీం కింద రిజిస్టరైతే సబ్సిడీ లభిస్తుంది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అయితే ఈ …

Read More »

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

తెలంగాణలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.46,040కు చేరింది. ఇక 22 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగి రూ.42,200కు చేరింది. ఇక వెండి కేజీపై రూ.900 పెరిగి రూ.72,500గా ఉంది

Read More »