ఒక ఆర్థిక సంవత్సరంలో అవసరం ఉన్న మేరకు విద్యుత్ కొనుగోళ్లు, పంపిణీ చేసేందుకు అవసరమయ్యే వ్యయాన్ని అంచనా వేసి ఈఆర్సీ ఆమోదిస్తోంది. వాస్తవిక వ్యయం అంచనా కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు.
ఎక్కువగా ఉంటే ట్రూఅప్, తక్కువగా ఉంటే ట్రూడౌన్ చేస్తారు. ట్రూఅప్ అయితే వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ట్రూడౌన్ అయితే విద్యుత్ బిల్లులో తగ్గిస్తారు.