Home / BUSINESS (page 5)

BUSINESS

తగ్గిన బంగారం ధరలు

ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు బుధవారం కిందకు దిగోచ్చాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరమైన హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బుధవారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.920తగ్గి రూ.42,300వద్ద కొనసాగుతుంది. ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.38,700కు పడిపోయింది. మరోవైపు వెండి ధర రూ.41,780కి పతనమయింది. జూవెల్లర్ల నుండి డిమాండ్ తగ్గడమే బుధవారం బంగారం ధరలు తగ్గడానికి …

Read More »

స్టాక్ మార్కెట్లకు ఊరట

మార్కెట్ వారం ప్రారంభరోజు అయిన సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. కానీ ఈరోజు మంగళవారం కాస్త కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ నలబై తొమ్మిది పాయింట్ల లాభంతో 31,434 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 9,224 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. యస్ బ్యాంక్, హెక్సావేర్,టాటా స్టీల్ కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పీవీఆర్,ఫ్యూచర్స్ రిటైల్ ,ఎండ్యూరెన్స్ టెక్నాలజీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Read More »

కరోనా ప్రభావంతో బెంగుళూరు ఇన్ఫోసిస్ ఖాళీ

కంపెనీలో ఒక ఉద్యోగికి కరోనా వచ్చిందని అనుమానంతో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం భవనం ఖాళీ చేశారు. ఆ ఉద్యోగికి కరోనా వచ్చిందనే ముందు జాగ్రత్తతోనే మిగతా ఉద్యోగులను అలర్ట్ చేశామని ఇన్ఫోసిస్ అధికారి గురురాజ్ దేశ్‌పాండే  తెలిపారు.  ఉద్యోగుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగానే భవనాన్నిఖాళీ చేశామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మోద్దని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులు ఏదైనా సమాచారం కోరకు తమ కంపెనీ గ్లోబల్ హెల్ప్ …

Read More »

కరోనా ఎఫెక్ట్..ఆపిల్ స్టోర్స్ అన్నీ మూసివేత !

కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో ఆపిల్ మార్చి 27 వరకు చైనా వెలుపల తన స్టోర్స్ అన్నింటినీ మూసివేస్తున్నట్లు సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. ఆపిల్ యొక్క ఆన్‌లైన్ స్టోర్ తెరిచి ఉంటుంది, అయితే చైనా వెలుపల కార్యాలయ సిబ్బంది వీలైతే రిమోట్‌గా పనిచేస్తారని కుక్ తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన ఈ సంస్థకు ప్రపంచంలోని 24 దేశాలలో 500 దుకాణాలు ఉన్నాయి.  స్టోర్స్ ముసేసినప్పటికీ, ఉద్యోగులకు సాధారణ వేతనం …

Read More »

ఆ ఒక్కరోజే ముఖేష్ అంబానీ పతనానికి కారణమట..ఎందుకంటే?

ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు వేడి వేడిగా ఉన్నాయి.ఇండియా లేదా అమెరికా ఇలా ఏ దేశమైన ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బతో చమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా స్టాక్ ధరలు పడిపోయాయి. ముఖ్యంగా మార్చి9 రోజే చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి చెడ్డ రోజు అని చెప్పాలి. ఈ దెబ్బతో అంబానీ ఇకపై ఆసియా యొక్క ధనవంతుడు కాదని చెప్పాలి..ఎందుకంటే ! * …

Read More »

తులం బంగారం లక్ష..

వినడానికి వింతగా.. మరింత ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం. త్వరలోనే బంగారం తులం లక్షకు చేరుకుంటుందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం ధర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. ఇప్పటికే ఇరవై నాలుగు క్యారెట్ల ధర రూ. నలబై ఐదు వేల రూపాయల మార్కును క్రాస్ చేసింది. ప్రస్తుతం చైనా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ విజృంభించడంతో గత నెలరోజులుగా బంగారం ధరలు ఆల్ టైం రికార్డుల మోత …

Read More »

వాట్సాప్‌ లో సరికొత్త ఫీచర్‌

ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌తో ముందుకు రానుంది. యూజర్ల భద్రత, గోప్యతలను పరిరక్షించే చర్యల్లో భాగంగా ఈ ఫీచర్‌ను జోడిస్తోంది. ఇకపై వాట్సాప్‌ యూజర్లు పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ద్వారా తమ చాట్‌ బ్యాక్ అప్ను కాపాడుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. పాస్‌వర్డ్‌ ప్రొటెక్ట్‌ బ్యాక్ అప్స్‌ అనే ఫీచర్‌ పేరుతో న్యూ అప్‌డేట్‌ ఉంటుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. బీటా యూజర్లకే నూతన ఫీచర్‌ అందుబాటులో …

Read More »

గూగుల్ పే,పేటీఎం వాడుతున్నారా..?

మీరు గూగుల్ పే వాడుతున్నారా…?. పేటీఎం వాడకుండా అసలు మీకు రోజునే గడవదా..?. అయితే మీరు కాస్త జాగ్రత్త వహించాల్సిందే. అధునీక యుగంలో నేరాలకు కాదేది అనర్హం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. యూపీఐ యాప్ ల వినియోగం పెరుగుతున్న క్రమంలో వీటిపై వారి కన్ను పడింది. గూగుల్ పే,పేటీఎం లలో ఈ నెంబరుకు మీరు ఎంత పంపిస్తే అంత రెట్టింపు డబ్బులు వస్తాయి అని కొన్ని నెంబర్లను …

Read More »

జీఎస్టీ రాబడిలో తెలంగాణ టాప్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులను,ఆర్థిక ప్రతిబంధకాలను అధిగమించి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)రాబడిలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకతను చాటుకుంటుంది.పన్ను వసూళ్లలో భారీ లక్ష్య సాధనవైపు వడివడిగా అడుగులేస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక స్పెషల్ డ్రైవ్స్ ,ప్రత్యేక యాప్ లతో జీరో దందాను పూర్తిగా నిరోధించి ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ రాబడులు తగ్గిన కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం టాప్ …

Read More »

నిరుద్యోగులకు ఆర్బీఐ శుభవార్త

దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఆర్బీఐ శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని ఆర్బీఐ తీసుకోచ్చింది. దీని ద్వారా నిరుద్యోగులు ఏటీఎంను నెలకొల్పవచ్చు. ఏటీఎంను ఏర్పాటు చేయాలనుకుంటే బిజీగా ఉన్న మార్కెట్లో ఇరవై ఐదు నుండి ముప్పై చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆ తర్వాత బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎంను అందిస్తాయి. మీరు ఏర్పాటు చేసిన ఏటీఎంల ద్వారా ఎన్ని …

Read More »