Home / NATIONAL (page 18)

NATIONAL

మోదీకి ఢిల్లీ సీఎం క్రేజీ ఫంచ్

దేశంలో వ్యాక్సినేషన్ కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఎందుకు టీకాలు కొనడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్తాన్ దేశంపై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా? సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా? అంటూ మండిపడ్డారు. ఇతర దేశాల లాగా కాకుండా దేశంలో 6 నెలలు ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు.

Read More »

సీబీఐ కొత్త చీఫ్ సుబోధ్ జైస్వాల్ గురించి మీకోసం

సీబీఐ కొత్త చీఫ్ గా సుబోధ్ జైస్వాల్ ను నియమించింది కేంద్ర సర్కారు. ఆయన గురించి తెలియని విషయాలు మీకోసం.. 1962లో జన్మించిన సుబోధ్ జైస్వాల్ ముంబై యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్లో పనిచేశారు. రూ.20 వేల కోట్ల స్టాంపు పేపర్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేశారు. 2006 ముంబై రైలు బాంబు పేలుళ్ల సమయంలో సీపీగా ఉన్నారు. మహారాష్ట్ర డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో సేవలందించారు. …

Read More »

అసలు టూల్‌కిట్‌ రభస ఏమిటి?

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంతో, విద్వేష జాఢ్యంతో ప్రతిపక్షాలపై నిత్యం విషం గక్కే బిజెపి, కాషాయ పరివారం ఈ సారి తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది. – దేశాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం చేసుకున్న టూల్‌కిట్‌ చూడండి అంటూ ఎఐసిసి అధికారిక లెటర్‌ హెడ్‌ కాపీగా ఒక పత్రాన్ని జతచేసి ‘కాంగ్రెస్‌టూల్‌కిట్‌ ఎక్స్‌పోజ్డ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా …

Read More »

ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ

ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవాలన్న ఆయన.. కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ల కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి.. వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మోడర్నా, ఫైజర్ వంటి అమెరికా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తామన్న నేపథ్యంలో కేరళ సీఎం లేఖ ఆసక్తిగా మారింది.

Read More »

లాక్డౌన్ సడలింపుల దిశగా అడుగులు

మహారాష్ట్రలో క్రమంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతుండటంతో లాక్డౌన్ సడలింపుల దిశగా ఆ రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. లాక్డౌన్ను దశలవారీగా సడలిస్తామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. జూన్ 30 నాటికి అన్లాక్ ప్రక్రియ పూర్తవుతుందని, అయితే ఎప్పటి నుంచి అన్లాక్ ప్రారంభించాలనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. మొత్తం నాలుగు దశల్లో అన్లాక్ అమలు చేయనున్నట్లు చెప్పారు.

Read More »

అందుకే అబ్దుల్ కలాంకు సెల్యూట్

2డీజీ (2-డీయాక్సీ-డీ-గ్లూకోజ్) కొవిడ్ ఔషధాన్ని DRDO గ్వాలియర్ 25 ఏళ్ల క్రితమే రూపొందించిందని ఆ సంస్థ మాజీ శాస్త్రవేత్త డా. కరుణ్ శంకర్ వెల్లడించారు. ఈ 2DG అణువును రూపొందించాలని ఆనాటి DRDO డైరెక్టర్ APJ అబ్దుల్ కలాం సూచించారని తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో వాడే దీని కోసం అప్పట్నుంచి USపై ఆధారపడటం తగ్గించామని పేర్కొన్నారు. దీనికి 1998లో పేటెంట్ రాగా.. 2002లో డ్రగ్కు ఆమోదం లభించింది.

Read More »

మోదీకి జగన్ లేఖ

ప్రధాని మోదీకి ఏపీ సీఎం  జగన్ లేఖ రాశారు. ‘అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది మా నిర్ణయం. వ్యాక్సిన్ల కొరతతో 45 ఏళ్లు పైబడిన వారికే ఇస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు. వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధరను నిర్ణయిస్తున్నారు. దీని వల్ల సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ చేరాలంటే నెలలు పట్టేలా ఉంది’ అని జగన్ లేఖలో పేర్కొన్నారు

Read More »

ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ సెటైర్లు

కొవిడ్ మందుల పేర్లు పలికేందుకు కష్టంగా ఉన్నాయని, వీటికి పేర్లు పెట్టడంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ హస్తం ఉందా అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. వాటిని కొరోనిల్, కొరొజీరో, గోకరోనాగో అని పిలవడానికి అభ్యంతరం లేదని, భారీ ఇంగ్లీష్ పదాలతో ట్వీట్ చేశారు. ఆంగ్లంలో పాండిత్యం అధికంగా ఉన్న నేతగా శశిథరూర్కు పేరుంది. ఈ క్రమంలో …

Read More »

సినిమాల్లోకి మోదీ

కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనవడం పట్ల కాంగ్రెస్ స్పందించింది. మోదీ సినిమాల్లో నటించాలని ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. కరోనాతో దేశ ప్రజలు చనిపోతుంటే, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

Read More »

కంటతడిపెట్టిన ప్రధాని మోదీ

కరోనాతో పాటు ప్రధాన సవాల్ గా ముందుకొచ్చిన బ్లాక్ ఫంగస్ నిరోధానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రధాని మోదీ కోరారు. మహమ్మారి సమసిపోయేవరకూ ప్రజలు సేదతీరరాదని చెప్పారు. కొవిడ్ పరిస్థితులపై నేడు ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కొవిడ్తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read More »