Home / NATIONAL (page 19)

NATIONAL

థర్డ్ వేవ్ భయాంకరంగా ఉండబోతుందా..?

కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే.. థర్డ్వేవ్ భయాలు వణికిస్తున్నాయి. కర్ణాటకలో ఆల్రెడీ మూడో వేవ్ వచ్చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతకొన్ని రోజులుగా అక్కడ చిన్నారులు అధికంగా కరోనా బారిన పడుతున్నారు. మార్చి-మే నెలలను పోలిస్తే.. చిన్నారుల్లో 145% అధికంగా.. టీనేజ్ పిల్లల్లో 160% 3 3 అధికంగా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 2నెలల్లో ఇప్పటికే 15,000పైగా చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు.

Read More »

తౌక్టే తుపాను బీభత్సం

తౌక్టే తుపాను ధాటికి బాంబే హై తీరంలో కొట్టుకుపోయిన P-305 నౌకలో 26 మంది సిబ్బంది మరణించారు. వారి మృతదేహాలను గుర్తించారు. మరో 49 మంది ఆచూకీ తెలియట్లేదు. వారి కోసం నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. సోమవారం కొట్టుకుపోయిన ఈ నౌకను ముంబైకి 35 నాటికల్ మైళ్ల దూరంలో గుర్తించారు. నౌకలో మొత్తం 261 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 186 మందిని …

Read More »

కరోనా సెకెండ్ వేవ్ అంతం ఎప్పుడో తెలుసా..?

కరోనా సెకెండ్ వేవ్ పై కేంద్రం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం ఊరటనిచ్చే కబురు చెప్పింది. జులైతో దీనికి తెర పడే అవకాశాలున్నట్లు వెల్లడించింది. అలాగే 6-8 నెలల తర్వాతే థర్డ్ వేవ్ ఉండొచ్చని.. అయితే రెండో వేవ్ అంత తీవ్ర ప్రభావం చూపించదని అంచనా వేసింది. ‘సూత్ర’ (ససెప్టబుల్, అన్లిడిటెక్టెడ్, టెస్టెడ్ అండ్ రిమూవ్డ్ అప్రోచ్) అనే మోడల్ ద్వారా శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాలకు వచ్చింది.

Read More »

ఇక ఇంటి దగ్గరే కరోనా పరీక్షలు

పుణెలోని మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ లిమిటెడ్ రూపొందించిన హోమ్ ఐసోలేషన్ టెస్టింగ్ కిట్ వినియోగానికి ICMR అనుమతిచ్చింది. దీంతో ఎవరైనా సొంతంగా ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. కోవి సెల్ఫ్ అనే పేరు గల ఈ కిట్ వినియోగానికి ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసోలేషన్లో ఉంటూ ICMR, ఆరోగ్య శాఖ …

Read More »

రోజుకు 90 లక్షల మందికి టీకా తప్పకుండా వేయాల్సిందే..లేకపోతే..?

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడం ఆందోళన కల్గిస్తోందని NDTV కో-ఫౌండర్ ప్రణయ్ రాయ్ ట్వీట్ చేశారు. 4 వారాల కింద రోజుకు 22 లక్షల మందికి, 2 వారాల కింద 20 లక్షల మందికి, వారం క్రితం 19 లక్షల మందికి టీకా ఇస్తే మే 19న మాత్రం 13 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని తెలిపారు. కరోనాపై విజయం సాధించాలంటే రోజుకు 90 లక్షల మందికి …

Read More »

క‌రోనా దెబ్బ‌కు ప‌డిపోయిన ప్ర‌ధాని రేటింగ్‌..!

ప్ర‌పంచంలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రేటింగ్‌ క్ర‌మంగా ప‌డిపోతూ వ‌స్తున్న‌ది. దేశం యావ‌త్తూ క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు విల‌విల్లాడుతున్న త‌రుణంలో గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా ప్ర‌ధాని మోదీ రేటింగ్ అత్యంత క‌నిష్టానికి ప‌డిపోయింది. ఈ విష‌యాన్ని ఆమెరికాకు చెందిన ఒక స‌ర్వే సంస్థ త‌న నివేదిక స్ప‌ష్టం చేసింది. 2014లో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో సైతం భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. గ‌త …

Read More »

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య కరోనా

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య కరోనాకు పాజిటివ్‌గా పరీక్ష చేశారు. దీంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని ఆరోగ్యశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. అలాగే ఆయన భార్య మీరా భట్టాచార్య సైతం వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఆమె మంగళవారం సాయంత్రం నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బుద్ధదేవ్‌ భట్టాచార్య, ఆయన సతీమణి, వారి సహాయకుడి నుంచి ఉదయం నమూనాలను సేకరించగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా …

Read More »

క‌రోనాతో మ‌ర‌ణించిన‌ యూపీ మంత్రి

క‌రోనా మ‌హ‌మ్మారికి మ‌రో రాజ‌కీయ ప్ర‌ముఖుడు బ‌ల‌య్యారు. ఉత్తరప్రదేశ్ మంత్రి విజయ్ కశ్యప్ క‌రోనాతో క‌న్నుమూశారు. 56 ఏండ్ల క‌శ్య‌ప్ క‌రోనా బారిన‌ప‌డ‌టంతో గుర్గావ్‌లోని వేదాంత ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డ‌టంతో ఆయ‌న మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి తుదిశ్వాస విడిచారు. మంత్రి ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లోని ఛ‌ర్త‌వాల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. కాగా, సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ మంత్రివర్గంలో ఇప్ప‌టికే ఇద్ద‌రు మంత్రులు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించారు. క‌శ్య‌ప్ …

Read More »

భారత్ లో కొత్తగా 2,81,386 కరోనా కేసులు

భారత్లో గడిచిన 24 గంటల్లో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,49,65,463గా ఉంది. ఇక నిన్న 4106 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,74,390గా ఉంది. ప్రస్తుతం దేశంలో 35,16,997 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 3,78,741 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Read More »

కరోనా టీకాపై శుభవార్త

ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టీకా కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కాదని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ లేదన్న కారణంతో ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడం, టీకా, మందులు ఇవ్వకపోవడం లాంటివి చేయకూడదని పేర్కొంది. ఏ వ్యక్తి అయినా, లబ్ధిదారుడైనా ఆధార్ లేకున్నా ఎమర్జెన్సీ సేవలు పొందొచ్చని తెలిపింది. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, పింఛన్ డాక్యుమెంట్ చూయించి టీకా వేసుకోవచ్చని పేర్కొంది.

Read More »