ఏనుగుల గుంపు పరుగు పరుగున తన వైపునకు రావడంతో ఓ యువకుడు చెట్టెక్కిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. గజరాజుల నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు ఏకంగా గంటన్నర పాటు చెట్టుపైనే ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇడుక్కికి చెందిన సాజి అనే యువకుడు స్థానిక చిన్నకనల్ ప్రాంతంలో ఏదో పనిలో ఉండగా ఏనుగులు స్పీడుగా తనవైపు దూసుకొచ్చాయి. దీంతో యువకుడు పరుగులు …
Read More »వీడియో – వాయిస్ కాల్స్ కోసం వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇకపై వాట్సాప్‌లో వీడియో, వాయిస్ కాల్స్ కోసం ఇతరులను ఇన్వైట్ చేసేందుకు ఓ ప్రత్యేక లింక్‌లను ఉంచనుంది. లింక్‌ను క్లిక్ చేసి వెంటనే కనెక్ట్ అవ్వొచ్చు. ఇందుకు వాట్సాప్‌లోని కాల్ కేటగిరికి వెళ్లి లింక్ క్రియేట్ చేయాలి. ఈ న్యూ వెర్షన్ కోసం వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని మార్క్ జుకెర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. …
Read More »గులాం నబీ అజాద్ కొత్త పార్టీ ఇదే..?
గతంలో దాదాపు యాబై ఏండ్ల పాటు అనేక పదవులను అనుభవించిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్ము కశ్మీర్‌లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో నిన్న సోమవారంఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన నూతన పార్టీని ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తాను ప్రకటించిన సరికొత్త పార్టీ స్వతంత్ర ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రజాస్వామిక పునాదులపై వేళ్లూనుకుంటుందని తెలిపారు. అయితే తాను ప్రకటించనున్న …
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటీవ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 4129 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,45,72,243కు చేరాయి. ఇందులో 4,40,00,298 మంది కరోనా పాజిటీవ్ బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,530 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. మరో 43,415 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఆదివారం ఉదయం 8 గంటల నుంచి …
Read More »గులాం నబీ అజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి .. దాదాపు ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గులాం నబీ అజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు పూనుకున్నారు. దీనికి సంబంధించిన పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆజాద్ ఈ రోజు సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నది. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ …
Read More »తమిళనాడులో డీఎంకే ,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం
తమిళనాడులో అధికార పార్టీ అయిన డీఎంకే,కేంద్రంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీకి చెందిన నేతల మధ్య వారసత్వ రాజకీయాలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం, నీట్ ను వ్యతిరేకించడంపై ‘చదువురాని వాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తే ఇలాగే ఉంటుంది’ అని సీఎం.. డీఎంకే అధినేత స్టాలిన్ పై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. దీంతో ‘అసలు జైషా ఎవరు? ఎన్ని …
Read More »లవర్‌తో భర్త.. రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్న భార్య
ఓ మహిళతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న భర్త.. తన భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన జంటకు 16 ఏళ్ల క్రితమే పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్త.. మరో మహిళతో కలిసి తిరగడాన్ని భార్య బంధువులు గుర్తించి ఆమెకు …
Read More »దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా
దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,45,63,337కు చేరింది. ఇందులో ఇప్పటికే 4,39,90,414 మంది కరోనా బాధితులు కోలుకున్నారు, 5,28,487 మంది కరోనా మహమ్మారి భారీన పడిన మృతిచెందారు. మరో 44,436 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 19 మంది కరోనాకు బలయ్యారు. 5719 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.ఇక రోజువారీ పాజిటివిటీ …
Read More »తన చేతులతోనే లెట్రిన్ క్లీన్ చేసిన ఎంపీ
బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మరుగుదొడ్డిని క్లీన్ చేసి సంచలనం సృష్టించారు. దీనిలో వింతేముంది అనుకుంటున్నారా? మరుగుదొడ్డిని ఎంపీ క్లీన్ చేసింది వివిధ వస్తువలను ఉపయోగించి కాదు.. స్వతహాగా తన చేతులతో. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్‌లో చోటుచేసుకుంది. రీవా నుంచి ఎంపీగా గెలుపొందిన జనార్దన్‌హ మిశ్రా.. మౌగంజ్‌లోని గవర్నమెంట్ బాలిక పాఠశాలను సందర్శించారు. అక్కడ మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉండటాన్ని ఆయన గమనించారు. వెంటనే అక్కడకు …
Read More »పంజాబ్ సీఎం కు ఢిల్లీ సీఎం మద్ధతు
పంజాబ్ సీఎం అయిన భగవంత్ కు ఆప్ ఆధినేత.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మద్దతుగా నిలిచారు. ఇటీవల జర్మనీ దేశం నుంచి ఢిల్లీ వస్తుండగా తప్పతాగి ఉండటంతో పంజాబ్ సీఎం భగవంత్ ను తాను ప్రయాణిస్తోన్న విమానం నుంచి దించేశారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ సందర్భంగా ఖండించారు. ‘పంజాబ్ రాష్ట్రంలో గత 75 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయని మంచి పనులను ముఖ్యమంత్రిగా …
Read More »