తమిళనాడులో ఐటీ శాఖ (ఆదాయపు పన్ను) దాడులు కలకలం సృష్టించాయి. ఆ రాష్ట్ర విద్యుత్, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై , కరూర్ , కోయంబత్తూర్ తోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాలు, ఆస్తులపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంత్రి దగ్గరి బంధువులు, పలువురు కాంట్రాక్టర్ల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.
Read More »యూపీలోదారుణం – భర్తను కట్టేసి మరి..?
యూపీ రాంపూర్ లో దారుణమైన సంఘటన జరిగింది. ఓ మెకానిక్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు అతన్ని మంచానికి కట్టేసి మరి ఆయన భార్య, 13 ఏళ్ల కూతురిపై గ్యాంగ్ రేప్ చేసి పారిపోయారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కొన్ని రోజుల కిందట సదరు వ్యక్తితో కొందరు గొడవపడ్డారని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.
Read More »క్రాస్ అయిన ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్
రూ.2వేల నోట్ల ఉపసంహరణతో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది నిజామా..? కాదా అని తెలుసుకునేందుకు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ను ప్రజలు పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. దీంతో వెబ్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. కాగా 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి అంతరాయమే ఏర్పడింది.
Read More »రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం
రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ప్రజలు ఒకసారి గరిష్టంగా రూ.20వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది.
Read More »రూ.2వేల నోట్ల రద్ధుతో ఎవరికి లాభం .. ఎవరికి నష్టం..?
గతంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అనే అపోహ ప్రజల్లో నెలకొంది. అయితే సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉండదని అర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్లాక్ దందాలు చేసే వారిపై ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు ప్రజలు క్యూ …
Read More »కర్ణాటక సీఎంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్ణాటక సీఎంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉంటారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. డీకే పీసీసీ చీఫ్ కొనసాగుతారని వెల్లడించారు. ఎల్లుండి సిద్ధరామయ్య, శివకుమార్, మరికొందరు మంత్రులు ప్రమాణం చేస్తారని తెలిపారు. సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు
Read More »మనిషి ఆకారంలో ఉన్న వింత పురుగు..!?
తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం చెనుగొనిపల్లి గ్రామంలో హలీం పాషా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి రూపాలతో ఉన్న ఈ వింత పురుగు కనిపించడం జరిగింది. ఆశ్చర్యంగా కనిపిస్తున్న ఈ వింత పురుగుకి కళ్ళు, ముక్కు, నోరు, తల మొత్తంగా చెప్పాలంటే తలభాగం మనిషికి ఉండే విధంగా కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి సంఘటననే సుమారు 15 సంవత్సరాల కిందట గద్వాల పట్టణంలో …
Read More »కర్ణాటక సీఎం ఎవరు..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి ఎవరికి ఇవ్వాలన్న అంశంపై తర్జనభర్జన పడుతోంది. ఆ పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఆ పోస్టుకు పోటీపడుతున్నారు. సీఎంను ఎన్నుకునే విషయంలో ఏక వాఖ్య తీర్మానం చేశామని, ఆ అంశాన్ని పార్టీ హైకమాండ్‌కు వదిలేస్తున్నామని, తాను ఢిల్లీకి వెళ్లడం లేదని, తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించినట్లు కర్ణాటక …
Read More »వెనుకంజలో మంత్రి శ్రీరాములు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు శనివారం విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 124.. బీజేపీ పార్టీకి 70.. జేడీఎస్ పార్టీకి 23.. ఇతరులకు 7 స్థానాల్లో అధిక్యం ఉంది. అయితే బళ్లారి రూరల్ నియోజకవర్గంలో ఆశ్చర్యకర ఫలితాలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో మంచి పట్టున్న మంత్రి శ్రీరాములు 830 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. తొలిరౌండ్ పూర్తి అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్రకు 5,862 …
Read More »కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 8 మంది మంత్రులు వెనకంజ
కర్ణాటక అసెంబ్లీ ఫలితాల ఆరంభ ట్రెండ్స్ బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. సీఎం బసవరాజ్ బొమ్మై ఆధిక్యంలో ఉన్నారు.. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలోని 8 మంది మంత్రులు వెనకంజలో ఉన్నట్లు కర్ణాటక నుంచి అప్డేట్ వస్తోంది. కమీషన్లలో మితిమీరిన మంత్రుల అవినీతి, క్షేత్రస్థాయిలో పనితీరు, నాయకత్వ లోపం వంటివి దీనికి కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు
Read More »