త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరి భద్రత కల్పించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటిచేస్తున్న సిన్హాకు కేంద్ర హోంఖ సీఆర్‌పీఎఫ్ సాయుధ కమాండోల రక్షణ కల్పించింది. యశ్వంత్ సిన్హా ఈ నెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తన నామపత్రాలను సర్పించనున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్‌వాదీ …
Read More »దేశంలో కరోనా కలవరం
దేశంలో గత రెండు వారాలుగా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో పెద్దసంఖ్యలో యాక్టివ్ పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న గురువారం ఒక్కరోజే 13 వేల మంది కరోనా బారినపడ్డారు. తాజాగా నేడు శుక్రవారం కొత్తగా 17,336 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,62,294కు చేరాయి. ఇందులో 4,27,49,056 మంది కరోనా వైరస్ బాధితులు …
Read More »శివసేనకు కొత్త ఏమి కాదు-గతంలో ఎన్ని సార్లు అంటే..?
మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేనకి చెందిన నేత, ఆ రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కూలిపోయే ప్రమాదంలో ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే షిండే వెంట పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేల్లో 2/3 వంతు (37 …
Read More »దేశంలో కరోనా కలవరం
గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న బుధవారం ఒక్కరోజే 12 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు గురువారం కొత్తగా 13,313 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,33,44,958కి పెరిగాయి. ఇందులో 4,27,36,027 మంది బాధితులు కోలుకోగా, 83,990 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,941 మంది బాధితులు మృతిచెందారు. కాగా, బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 38 మంది …
Read More »నదిలో ఓ జంట అనుచిత ప్రవర్తన -చితకొట్టిన జనం -వీడియో వైరల్
అయోధ్యలో సరయూ నదిలో ఓ జంట అనుచితంగా ప్రవర్తించింది. నదిలో పుణ్య స్నానం ఆచరిస్తూ భార్యతో భర్త సరసం ఆడాడు. భార్యకు కిస్సులు ఇవ్వడాన్ని చూసిన జనం ఆ వ్యక్తిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. నదిలో స్నానం చేస్తున్న జనం ఆ భార్యాభర్తలను నిలదీశారు. భార్య వద్ద నుంచి భర్తను లాగేసి చితక్కొట్టారు. భార్య అడ్డుకునే ప్రయత్నం చేసినా అక్కడున్న వారు ఎవరూ వినలేదు. …
Read More »విజయ్‌కాంత్ కాలు మూడు వేళ్లు తొలగింపు
తమిళనాడుకు చెందిన సీనియర్‌నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ కాలికి సర్జరీ జరిగింది. గతకొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కాలికి ఇన్‌ఫెక్షన్ సోకడంతో వైద్యులు సర్జరీ చేయాల్సి వచ్చింది. కాలుకి రక్త సరఫరా కాకపోవడంతో అత్యవసరంగా మూడు కాలి వేళ్లను తొలగించారు. ఈ మేరకు డీఎండీకే వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. రెండు మూడురోజుల్లో విజయ్‌కాంత్ డిశ్చార్జ్ అవుతారని తెలిపాయి.
Read More »ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సింప్లిసిటీ..
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము తన నిరాడంబరతను చాటుకున్నారు. తన స్వస్థలంలో ఓ ఆలయానికి వెళ్లిన ఆమె.. అక్కడ స్వయంగా చీపురు పట్టి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా రాయ్‌రంగ్‌పూర్. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికైన నేపథ్యంలో ఆమె అక్కడి శివాలయానికి వెళ్లి ఆలయ పరిసరాలను ఊడ్చారు. ఇప్పటికే గవర్నర్, మంత్రి, ఎమ్మెల్యే పదవులు చేపట్టిన …
Read More »“యోగా ఫర్ హ్యూమానిటీ”.. నేడు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం
ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా “యోగా ఫర్ హ్యూమానిటీ”అనే థీమ్‌తో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మానసిక, శారీరక వికాసానికి యోగా చాలా ముఖ్యం. దేశ వ్యాప్తంగా ప్రముఖులు, సినీతారలు ప్రత్యేక సందేశాలను అందిస్తూ యోగా ఆసనాలు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మైసూర్‌లో యోగా దినోత్సవ వేడుల్లో పాల్గొన్నారు. కాశ్మీర్‌తో పాటు పలు చోట్ల ఆర్మీ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఆసనాలతో అలరించారు. క్రికెటర్లు …
Read More »కత్తి తీసినా.. ఎస్సై భయపడకుండా కుమ్మేశాడు!
ఓ ఎస్సై దుండగుడితో పోరాడి అతడిని నిలువరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలో జరిగింది. అలప్పుజ జిల్లా కాయంకులమ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి ముందు పోలీసులు జీపు ఆపే ప్రయత్నం చేశారు. ఎస్సై అరుణ్‌కుమార్ కిందికి దిగుతుండగా.. దుండగుడు గమనించి వెంటన తన బైక్‌లో ఉంచి కత్తిని బయటకు తీసి ఎస్సైపైకి దాడికి యత్నించాడు. వెంటనే …
Read More »తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు అస్వస్థత
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేలికపాటి జ్వరంతో అస్వస్థత చెందారని ఆ రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్ తెలిపారు. మొన్న శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారని మంత్రి దురైమురుగన్ తెలిపారు. జ్వరం కారణంగా సోమవారం మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యింది. ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో …
Read More »