Home / SLIDER (page 398)

SLIDER

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎవరి పాత్ర హైలైట్‌? పరుచూరి ఏం చెప్పారంటే..

జక్కన్న ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చి రికార్డులు సృష్టించిన మూవీ ‘ర్‌ఆర్‌ఆర్‌.’ ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పోటీపడి నటించారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ తమ పాత్రల్లో అదరగొట్టేశారు. అయితే ఈ సినిమాలో ఎవరి పాత్ర ఎక్కువ.. ఎవరిది తక్కువ అనే దానిపై ఫ్యాన్స్‌ చర్చలకు తెరలేపారు. ఎవరికి అనుకూలంగా వారు తమ అభిప్రాయాలను చెప్పారు. మరోవైపు దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన …

Read More »

అయ్యో.. లుంగీ కట్టుకొచ్చాడని సినిమా టికెట్‌ ఇవ్వలేదు!

లుంగీ కట్టుకుని థియేటర్‌కు వచ్చాడని మేనేజ్‌మెంట్‌ సినిమా టికెట్‌ నిరాకరించింది. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సదరు వ్యక్తి చేసిన ఆరోపణలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో థియేటర్‌ మేనేజ్‌మెంట్‌ వివరణ ఇచ్చింది. బంగ్లాదేశ్‌లోని మీర్‌పూర్‌లో ఉన్న ‘స్టార్‌ సినీ ప్లెక్స్‌’లో ‘పోరన్‌’ సినిమా ఆడుతోంది. ఆ సినిమా చూసేందుకు సమన్‌ అలీ సర్కార్‌ అనే వ్యక్తి లుంగీ ధరించి వెళ్లారు. …

Read More »

చంద్రబాబు ఎదుటే కేశినేని నాని ఫ్రస్టేషన్‌!

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని మరోసారి తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టారు. విజయవాడలో తన సోదరుడు కేశినేని శివనాథ్‌ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారంటూ గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న కేశినేని నాని.. పార్టీ అధినేత ముందే తన అసహనాన్ని ప్రదర్శించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ టీడీపీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలుకుతూ బొకేలు అందించి ఫొటోలు దిగారు. ఈ …

Read More »

దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.. అందుకే బాయ్‌కాట్‌ చేస్తున్నా: కేసీఆర్‌ ఫైర్‌

సమాఖ్య, సహకార స్ఫూర్తిని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని.. మహాత్మాగాంధీ చరిత్రను మలినం చేయాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై తీవ్రస్థాయిలో కేసీఆర్‌ మండిపడ్డారు. గాంధీకి లేని అవలక్షణాలను ఆయనకు అంటగట్టి హేళన చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.90లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం …

Read More »

ఢిల్లీకి బండి‌ సంజయ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి‌ సంజయ్  ఢిల్లీ  కి బయల్దేరనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఆయన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  దీంతో బండి సంజయ్ తన పాదయాత్రకు శనివారం తాత్కాలిక విరామం ప్రకటించారు. ఢిల్లీలో ఆయన బీజేపీ  అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఈనెల 21న మునుగోడులో సభ,  పాదయాత్ర ముగింపు సభలకు అమిత్ షా, జేపీ నడ్డాను అహ్వానించనున్నట్లు తెలిసింది. మునుగోడు …

Read More »

రేషన్‌ కార్డులకు వెబ్‌ రిజిస్ట్రేషన్‌

 ఇల్లులేనివారు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్‌కార్డులు అందించేందుకు కామన్‌ రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. పైలట్‌ ప్రాజెక్టు కింద 11 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని రాష్ర్టాల్లోనూ అమలుచేయనున్నారు. అర్హులైన వారిని వేగంగా గుర్తించి రేషన్‌ కార్డులు అందించడంలో రాష్ర్టాలకు సహకారం అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. వలసదారులు, ఇతర లబ్ధిదారులు ఎవరిసాయమైనా తీసుకొని కామన్‌రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీలో …

Read More »

దేశ వ్యాప్తంగా క‌రోనా ఉధృతి

దేశ వ్యాప్తంగా క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 19,406 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 19,928 మంది కోలుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 1,34,793 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా ఉంద‌ని తెలిపింది.

Read More »

తెలంగాణ సర్కారు వినూత్న నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కారు దవాఖానాల్లో గర్భిణీలకు నార్మల్ డెలివరీలు నిర్వహించినందుకు ఇన్సెంటివ్ లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్  ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డెలివరీకి రూ.3 వేల చొప్పున ఇవ్వాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీ జీవో జారీచేశారు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికాన్ని డాక్టర్ నుంచి శానిటేషన్ స్టాఫ్వరకు గైనకాలజిస్ట్ / మెడికల్ ఆఫీసర్, మిడ్వైఫ్/స్టాఫ్ నర్సు/ఏఎన్ఎంలకు రూ.1000, ఆయా/శానిటేషన్ వర్కర్లకు రూ.500, ఏఎన్ఎంకు రూ.250 …

Read More »

వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టనివ్వం

 రైతుకు హాని చేసే ఏ చర్యనూ తాము ఒప్పుకోబోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టబోమని టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఎనర్జీ కన్వర్జేషన్‌ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన లోక్‌సభలో మాట్లాడారు. ఈ బిల్లును బిల్లును మామూలుగా చదివితే ఫర్వాలేదనిపిస్తుందని, కానీ ఈ బిల్లు సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న బలవంతపు విధానాలతో దేశం మరింత వెనుకబడిపోతుందని ఆవేదన …

Read More »

సినిమాల గురించి మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

సినిమాల్లో కంటెంట్ బావుంటే ఆ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నిన్న విడుదలైన సీతారామం, బింబిసార చిత్రాలు విజయం సాధించడం పట్ల మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు. రెండు చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఈ రెండు చిత్రాల విజయం ఎంతో ఊరటనిచ్చిందని చిరు ట్వీట్లో పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat