అంతా ఊహించినట్లే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. భారత టెస్టు సారథిగా ఎంపికయ్యాడు. సఫారీ పర్యటన అనంతరం విరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు వదిలేయగా.. శనివారం ఆల్ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ రోహిత్‌ను నాయకుడిగా నియమించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ భారత 35వ సారథిగా సేవలందించనున్నాడు. సభ్యులంతా రోహిత్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పేర్కొన్నాడు. మార్చి 4 నుంచి …
Read More »SRHకు భారీ షాక్
ఐపీఎల్ -2022 సీజన్ ఆరంభానికి ముందు SRHకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్.. సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు.. ది ఆస్ట్రేలియన్ పత్రిక కథనం ప్రచురించింది. గత సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన SRH.. కేవలం మూడింటిలో గెలిచింది. ఈ క్రమంలో కటిచ్ రాజీనామా …
Read More »మిథాలీరాజ్ అరుదైన రికార్డులు
కివీస్ తో జరిగిన రెండో వన్డేలో భారత క్రికెటర్ మిథాలీరాజ్ అరుదైన రికార్డులు సాధించింది. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన రిచాఘోష్తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. మిథాలీ మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన 4ఏళ్లకు రిచా జన్మించింది. అలాగే 20ఏళ్ల కెరీర్ పూర్తయిన మొదటి మహిళా క్రికెటర్, కివీస్‌పై అత్యధిక హాఫ్ సెంచరీలు, రన్స్ చేసిన భారత కెప్టెన్ రికార్డులు నెలకొల్పింది. ధోనీ, కోహ్లి రికార్డులను బద్దలుకొట్టింది.
Read More »టీమిండియాపై న్యూజిలాండ్ మహిళల జట్టు ఘనవిజయం
క్వీన్స్టౌన్ వేదికగా ఇండియాతో జరిగిన రెండవ వన్డేలో న్యూజిలాండ్ మహిళల జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్వీన్స్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 270 రన్స్ చేసింది. మిథాలీ రాజ్, రిచా ఘోష్‌లో హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. మిథాలీ తన కెరీర్లో 61వ హాఫ్ సెంచరీ నమోదు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ జట్టు …
Read More »కొత్త కెప్టెన్ రోహిత్ శర్మకి బోణి అదిరింది.. గోల్డెన్ హ్యాండ్!
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మకి బోణి అదిరిపోయింది. గత ఏడాది డిసెంబరులో వన్డే జట్టు పగ్గాలు అందుకున్న హిట్‌మ్యాన్.. కెరీర్లో ఫస్ట్ టైమ్ భారత జట్టుని రెగ్యులర్ కెప్టెన్‌గా నడిపిస్తున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో.. రోహిత్ శర్మ తన వ్యూహ చతురతతో జట్టుకి తిరుగులేని విజయాల్ని అందిస్తున్నాడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా జట్టులో బౌలర్లని మారుస్తూ.. వారి అభిప్రాయాల్ని గౌరవిస్తూ ఫీల్డింగ్‌ని సెట్ చేస్తున్నాడు. ఈ …
Read More »టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్
టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్ ను ప్రకటిస్తానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. తాను సెలక్షన్ కమిటీ సమావేశాల్లో కూర్చొని సెలక్టర్లను ప్రభావితం చేశానని వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని దాదా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తానేమీ నేరుగా బోర్డు అధ్యక్షుడిని కాలేదన్నారు. 400 పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని సౌరవ్ గంగూలీ సూచించారు.
Read More »హెడ్ కోచ్ పదవికి జస్టిన్ లాంగర్ రాజీనామా
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆయన పదవీకాలం వచ్చే జూన్ నెల నాటికి ముగుస్తుంది.. దాన్ని సుదీర్ఘకాలం పొడిగించాలని లాంగర్ కోరినా బోర్డు అందుకు ససేమిరా అన్నది. దీంతో మనస్తాపంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. జట్టులో కొందరు ఆటగాళ్లతోనూ లాంగర్‌కు విభేదాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, ఆయన స్థానంలో ఆండ్రూ మెక్‌డొనాల్డ్స్ కొత్త హెడ్‌కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
Read More »ఫిబ్రవరి12న కివీస్ తో మహిళా టీమిండియా వన్డే సమరం
మరోవారం రోజుల్లో మహిళా జట్టులైన టీమిండియా-కివీస్ జట్ల మధ్య సవరించిన క్రికెట్ షెడ్యూల్ ప్రకారమే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ప్రారంభం కానున్నది. అందులో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖున మొదటి వన్డే మ్యాచ్ మొదలు కానున్నది. ఈ పర్యటనలో భాగంగా ఏకైక టీ20తో పాటు ఐదు వన్డే మ్యాచులు జరగనున్నాయి. అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈనెల పదకొండో తారీఖున మొదలు కానున్న ఈ సిరీస్ …
Read More »కుమ్మేసిన యువభారతం
వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత్ అదరగొట్టింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో 96 పరుగుల ఘన విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టీమిండియా నిర్ధేశించిన 291 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికిలా పడింది. 41.5 ఓవర్లలో కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో యువ భారత్ 96 పరుగులతో విజయకేతనం ఎగరవేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు శుభారంభం …
Read More »పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు
తనకూ సైబర్ వేధింపులు ఎదురయ్యాయని బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తాజాగా వెల్లడించారు. ఇంటర్నెట్లో అవహేళన చేయడం, బెదిరింపులు నిత్యం ఉటాయని, వాటిని బాలికలు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె పిలుపునిచ్చారు. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ‘‘ఇస్మార్ట్ సైబర్ చైల్డ్’’ పేరుతో తెలంగాణ మహిళల భద్ర త విభాగం శనివారం వెబినార్ నిర్వహించింది. ఇందులో పీవీ సింధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘సైబర్ నేరాల బారిన పడితే, వెంటనే …
Read More »