తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ అయిన వైఎస్ షర్మిల త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే ఇప్పటివరకు జిల్లాల వారీగా వైఎస్ అభిమానులు ఇతర నేతలతో భేటీ అయిన షర్మిల ఇక నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో మెదటి బహిరంగ సభ …
Read More »పురపాలక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని అధికార పార్టీ అయిన వైసీపీ అదరగొడుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 15 మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. మాచర్ల, పిడుగురాళ్ల, పులివెందుల, పుంగనూరు గిద్దలూరు, డోన్, ఆత్మకూరు, పలమనేరు, మదనపల్లి రాయచోటి, ఎర్రగుంట్ల, నాయుడుపేట, సూళ్లూరుపేట కనిగిరి, కొవ్వూరు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని 20 వార్డుల్లో …
Read More »కర్ణాటక సీఎం పై సీడీ సంచలనం
కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం సీడీలు కలకలం రేపుతున్నాయి. అధికార బీజేపీతో పాటు విపక్షంలోని కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు చెందిన సీడీలు తమవద్ద ఉన్నాయని ఒక పార్టీ నేతలు మరో పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యడి యూరప్పకు చెందిన సీడీ బీజేపీ ఎమ్మెల్యేల వద్ద ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే బసవనగౌడ యత్నాశ్ తెలిపారు. కొద్దికాలంగా యడ్డీపై ఈయన విమర్శలు చేస్తూ వస్తుండగా తాజాగా చేసిన సీడీ …
Read More »మార్చి 15 నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సమాయత్తం అవుతున్నారు. 2021-22 బడ్జెట్ ఏర్పాట్లు పూర్తవ్వగా.. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 18న 11:30నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి.
Read More »పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు-2021 – ‘పీపుల్స్ పల్స్’ సర్వే నివేదిక:
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు తథ్యంగా కన్పిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వంపట్ల నెలకొన్న వ్యతిరేకతే దీనికి కారణం. పశ్చిమ బెంగాల్ లో ‘పీపుల్స్ పల్స్’ ప్రతినిధులు పర్యటించి రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ డైరెక్టర్, …
Read More »బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతతత్వ పార్టీనే అని, తాను మతతత్వ వాదినేనని వ్యాఖ్యానించారు. 80% ఉన్న హిందువుల ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అనుకుంటే తాము చేసేది ఏమీ లేదన్నారు. ఒక వర్గానికి కొమ్ముకాసే కుహనా సెక్యులర్ పార్టీలను నమ్మొద్దని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడగని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎందుకు ఓట్లు …
Read More »బీజేపీపై ఎంపీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు
బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్యం సొంత పార్టీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. శ్రీధరన్ వయసు 89 ఏళ్లు, బీజేపీ రూల్స్ ప్రకారం 75 ఏళ్లు దాటిన వారికి పార్టీ పదవులు ఇవ్వరు. మరి ఇది సరైనా నిర్ణయమా? ఒక వేళ ఇది కరెక్ట్ అయితే.. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంత కుమార్లు 2024 …
Read More »నిండు సభలో బట్టలు విప్పేసిన ఎమ్మెల్యే
కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ పెద్ద రచ్చ జరిగింది. బీజేపీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తేవడంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు.బీజేపీ,ఆర్ఎస్ఎస్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో భద్రావతి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్.. తన షర్ట్ విప్పి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కోప్పడిన స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే.. అసభ్య ప్రవర్తనతో సభను అగౌరవపర్చారని ఎమ్మెల్యేను వారం సస్పెండ్ చేశారు. అనంతరం సభను …
Read More »బండి సంజయ్ కి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బహిరంగ లేఖ
నర్సంపేటకు పట్టభద్రుల ఎన్నికలనగానే ఓటు అడగడానికి నర్సంపేటకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు.. బండి సంజయ్ ఏ మొహం పెట్టుకుని నర్సంపేటకు వస్తున్నావు. ఈ ప్రాంత రైతుల పొట్టకొడుతున్న మీరు ఇక్కడ ఓట్లడగటానికి అర్హులనుకుంటున్నారా? నర్సంపేట రైతుల 100 ఏండ్ల కల ఐన రామప్ప-పాకాల & రామప్ప- రంగాయ చెరువు ప్రాజెక్టులను అడ్డుకుని రైతుల ప్రయోజనాలపై దెబ్బకొట్టిన మీరు సిగ్గులేకుండా ఓటు …
Read More »రాష్ట్ర ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి : మంత్రి కేటీఆర్
ఒకవైపు రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉసురు తీసి మరోవైపు ఉత్తరాల పేరుతో బీజేపీ డ్రామాలకు పాల్పడుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీఐఆర్ గురించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని …
Read More »