Home / SLIDER / బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతతత్వ పార్టీనే అని, తాను మతతత్వ వాదినేనని వ్యాఖ్యానించారు. 80% ఉన్న హిందువుల ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అనుకుంటే తాము చేసేది ఏమీ లేదన్నారు.

ఒక వర్గానికి కొమ్ముకాసే కుహనా సెక్యులర్ పార్టీలను నమ్మొద్దని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడగని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్  కు ఎందుకు ఓట్లు వేయాలన్నారు. ములుగులో సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు