ప్రస్తుతందేశంలో కరోనా కేసులు ఇప్పట్లో తగ్గేలా కన్పించడంలేదు. గత పదిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మరోమారు పెరిగాయి. ఈరోజు 74 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 66 లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 74,442 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య …
Read More »ఆర్‌ఆర్‌ఆర్ నటులకు 14 రోజుల క్వారంటైన్!
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా దెబ్బతో ఆగిపోయిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షెడ్యూల్స్ కొవిడ్ 19 వల్ల తల్లకిందులయ్యాయి. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి సహా ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమవుతుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ షూటింగ్‌కు …
Read More »తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2009 పాజిటివ్‌లు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. గురువారం 54,098 నమూనాలు పరీక్షించగా.. 2009 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,95,609కు చేరింది. 2,437 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకూ మొత్తం 1,65,844 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌లో 293, కరీంనగర్‌లో 114, ఖమ్మం 104, మేడ్చల్ 173, నల్గొండ 109, రంగారెడ్డి …
Read More »వైద్యాధికారులతో మంత్రి ఈటల సమావేశం
తెలంగాణలో కరోనా ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి. ఆసుపత్రిలో ఉన్న వివరాలు పేషంట్లు, బెడ్స్ వివరాలు, ఆక్సిజన్ ఫెసిలిటీ రోగులకు అందుతున్న సేవలపై మంత్రి సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసిన విధంగానే కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని వివరించిన అధికారులు.. అయినా పరీక్షల సంఖ్యను ఏమాత్రం కూడా తగ్గించవద్దని పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్ లను కూడా పరీక్షలు నిర్వహించడం ద్వారా పూర్తిస్థాయిలో కరోనా కట్టడి చేయాలని …
Read More »తెలంగాణలో కొత్తగా 1,378కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,378 పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,932 మంది కోలుకొని డిశ్చార్జి కాగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,87,211 మంది కోవిడ్-19 వైరస్ బారినపడగా 1,56,431 మంది చికిత్సకు కోలుకున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 1107 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం …
Read More »నేను నెగటీవ్
కోవిడ్ నిబంధనలతో షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. షూటింగ్‌లో పాల్గొనే ముందు కరోనా టెస్ట్‌లు చేయించుకుని చిత్రీకరణలో జాయిన్ అవుతున్నారు స్టార్స్. తాజాగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. కానీ ఈ టెస్ట్ నన్ను చాలా భయపెట్టింది అంటున్నారు. కరోనా టెస్ట్ చేయించుకున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు పాయల్. ‘‘కరోనా టెస్ట్ అంటే చాలా భయమేసింది. ముఖ్యంగా ఆ ముక్కులో నుంచి …
Read More »ఏపీలో ఒక్కరోజే 7,796కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 76,416 నమూనాలు పరీక్షించగా.. 6,923 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,75,674కు చేరింది. నిన్న ఒక్కరోజే 7,796 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,05,090 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 64,876. వైరస్ బాధితుల్లో కొత్తగా 45మంది మృతి చెందడంతో.. …
Read More »తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. వారంరోజులుగా నిత్యం 2వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా కోవిడ్ బారినపడిన వారిలో 2,281 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కారణంగా 11 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,83,866 మంది కరోనా బారినపడగా 1,52,441 మంది చికిత్సకు కోలుకొని …
Read More »మాజీ సీఎంకు కరోనా
కరోనా బారినపడుతున్న ప్రమఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. నిన్న అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఐసీయూలో చేరగా, తాజాగా జార్ఖండ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఆయన శుక్రవారం కరోనా పరీక్ష చేయించుకున్నారని, అందులో పాజిటివ్‌గా తేలిదని రాత్రి పోద్దుపోయిన తర్వాత ట్వీట్ చేశారు. తనకు కరోనా లక్షణాలు కన్పించడంతో పరీక్ష చేయించుకున్నానని చెప్పారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నానని …
Read More »ఏపీలో కొత్తగా కొత్తగా 7,073 కరోనా కేసులు..
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 7,073 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,61,458కి పెరిగింది. మరోవైపు 8,695 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీలు 5.88 లక్షలకు పెరిగాయి. ఇక కరోనాతో పోరాడుతూ మరో 48మంది చనిపోయారు. చిత్తూరులో 8, ప్రకాశంలో 8, అనంతపురంలో 6, కృష్ణాలో 5, పశ్చిమ గోదావరిలో …
Read More »