జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. డిసెంబర్ 1న జరిగిన పోలింగ్‌లో 34,50,331 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో 1926 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. డివిజన్లవారీగా ఆయా పార్టీలకు పోలైన ఓట్ల వివరాలు.. కుకట్‌పల్లి సర్కిల్.. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్- 17 (టీఆర్ఎస్ 8, బీజేపీ 7, చెల్లనివి రెండు ఓట్లు) …
Read More »ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్..
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ గ్రామం ప్రశాంతి నగర్ లోని శివా విద్యానికేతన్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈరోజు ఎమ్మెల్యే గారు ఓటు వేశారు. ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు …
Read More »జీహెచ్‌ఎంసీ పోలింగ్ అప్డేట్.. ఓటు వేసిన సినీ ప్రముఖులు వీళ్ళే
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ బల్దియా బాద్‌షా ఎవరో నిర్ణయించే ఎన్నికలు మంగళవారం ఉదయం ప్రారంభమైయాయి.మొత్తం 150 డివిజన్స్‌లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. * మెగాస్టార్ చిరంజీవి, సతీమణి సురేఖతో కలిసి జూబ్లీక్లబ్‌లో ఓటు హక్కును వియోగించుకున్నారు * ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఎఫ్‌ఎన్‌సీసీలో ఓటు వేశారు. * …
Read More »ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం : మంత్రి కేటీఆర్
టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం కల్పించినట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ, అభివృద్ధిని జోడెడ్లులాగా సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రాష్ర్టాన్ని ఎవరు ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారో ఆలోచించాలని కోరారు. ఆర్యవైశ్యులు కూడా ప్రత్యక్ష …
Read More »సీఎం కేసీఆర్ సభకు ముస్తాబవుతున్న ఎల్బీ స్టేడియం
సీఎం కేసీఆర్ బహిరంగ సభకు నగరంలోని ఎల్బీ స్టేడియం ముస్తాబవుతున్నది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28 సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సభా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీ కుమార్, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, పార్టీ నేత కర్నె ప్రభాకర్‌ను …
Read More »గుంపులుగా వాళ్లు.. సింగిల్‌గానే సీఎం
ఎన్నికలు రాగానే అందరూ పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నారని, ప్రశాంతమైన హైదరాబాద్‌లో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. హైదరాబాద్ వరదకష్టంలో ఉంటే ఒక్కరూ రాలేదని, కానీ, ఓట్లకోసం ఢిల్లీ నుంచి డజన్‌మంది దిగుతున్నారని విమర్శించారు. ‘ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు ముఖ్యం, మతం కాదు.. జనహితం ముఖ్యం. మన నినాదం విశ్వనగరం.. వాళ్లది విద్వేష నగరం, రెచ్చగొడితే రెచ్చిపోకండి.. పిచ్చోళ్ల మధ్య ఆగం కాకండి’ అని సూచించారు. …
Read More »ఎలాంటి హైదరాబాద్ కావాలో నిర్ణయించుకోండి-మంత్రి కేటీఆర్ గారు
గడిచిన ఆరేళ్లలో నగరంలో ఎలాంటి అశాంతి, అభద్రతా భావం లేదని, శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఎప్పడూ రాజీపడలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎలాంటి హైదరాబాద్ కావాలో పారిశ్రామిక వేత్తలు నిర్ణయించుకోవాలని సూచించారు. అభివృద్ధి హైదరాబాద్ కావాలా? అరాచకాల హైదరాబాద్ కావాలా? ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజా శ్రేయస్సు కోరే ప్రభుత్వం కావాలా? మతాల పేరుతో కిరికిరిలు పెట్టేవారు కావాలో ఆలోచించాలన్నారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలు లేవని, ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. …
Read More »నాయి బ్రాహ్మణులు,రజకులకు సీఎం కేసీఆర్ శుభవార్త
జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షౌరశాలలు(సెలున్లు)కు ప్రభుత్వం డిసెంబర్ నెల నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నేడు తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణులు చాలా కాలంగా కోరుతున్న ఈ కోరికను రాబోయే …
Read More »ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటికీ తెలియజేయాలి.
131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు మరియు స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేఎం గౌరీష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలందరూ …
Read More »ప్రయివేటీకరణే బీజేపీ మంత్రం-ఆర్థిక మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ నగరంలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారాస్త్రమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.ఎడాదికి కోటి చొప్పున ఉద్యోగాలిస్తామని చెప్పింది. ఆరున్నరేళ్లలే ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ తో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తోందన్నారు. ఈకారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పారు. బీఎస్ఎన్ఎల్, …
Read More »