దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కొత్తగా 36,946 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 422 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,95,958కు పెరిగింది.ఇందులో 3,08,57,467 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 4,24,773 …
Read More »ప్రధాని మోదీకి దీదీ షాక్
దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పెగాసస్ స్పైవేర్ వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణలపై రాష్ట్ర పరిధిలో విచారణ జరిపేందుకు కమిషన్‌ను నియమించారు. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి.లోకూర్‌తో ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆమె ఢిల్లీకి …
Read More »దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరో 507 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,57,720కు పెరిగింది. ఇందులో 3,04,29,339 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు …
Read More »నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జూలై 17 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఇది అంతర్జాతీయ నేర విభాగంలో న్యాయాన్ని సైతం ప్రోత్సాహిస్తుంది. ప్రస్తుత రోజుల్లో న్యాయ వ్యవస్థ సామాన్యుడికి న్యాయం కలిగేలా పలు చట్టాలను అందుబాటులోకి తెచ్చింది. చరిత్ర: రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17ను అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా 1998లో నిర్ణయంచారు. అయితే శిక్షార్హతకు వ్యతిరేకంగా …
Read More »కాంగ్రెస్ లోకి పీకే
ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్, ప్రియాంకా గాంధీలను కూడా కలిసిన విషయం తెలిసిందే. రానున్న రాష్ట్రాల ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికల గురించి ప్రశాంత్ కిశోర్.. గాంధీలతో చర్చించినట్లు భావించినా.. అంతకంటే పెద్దదే ఏదో జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పడం గమనార్హం.2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో …
Read More »బీజేపీ నేతలపై తిరగబడిన రైతులు
పంజాబ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు భూపేశ్ అగర్వాల్, ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలపై రైతులు దాడి చేశారు. పాటియాలా జిల్లాలోని రాజ్‌పురాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే పోలీసులే దగ్గరుండి ఈ దాడి చేయించారని బీజేపీ నేత భూపేశ్ అగర్వాల్ ఆరోపించారు. డీఎస్పీ తివానా మద్దతుతో సుమారు 500 మంది రైతులు తనను కొట్టారని ఆయన అన్నారు. డీఎస్పీ ఉద్దేశపూర్వకంగానే తనను తప్పుడు వైపునకు పంపారని …
Read More »దేశంలో కొత్తగా 34,703 కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది. రోజువారీ కొవిడ్ కేసులు 111 రోజుల కనిష్ఠానికి చేరాయి. కొత్తగా 34,703 కేసులు, 553 మరణాలు నమోదయ్యాయి. వరుసగా 54వ రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువ నమోదైంది. ఒక్క రోజులో 51,864 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 4,64,357 (1.52%)కి తగ్గాయి. దీంతో రికవరీ రేటు 97.17%కి పెరిగింది. సోమవారం 16,47,424 కొవిడ్ టెస్టులు చేశారు. రోజువారీ పాజిటివిటీ రేటు …
Read More »ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేశారు. గవర్నర్ బేబీ రాణీ మౌర్యకు ఆయన తన రాజీనామా సమర్పించారు. CMగా తీరత్ సింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెప్టెంబర్ 10 నాటికి 6 నెలలు ముగుస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 చోట్ల సెప్టెంబర్ 10 లోపు ఉపఎన్నికల నిర్వహణ సాధ్యం కానందునే ఆయన రాజీనామా చేశారు. తీరత్ బాధ్యతలు చేపట్టి 4 నెలలే కావడం గమనార్హం. రేపు …
Read More »133.89 కోట్లకు చేరిన దేశ జనాభా
తాజా లెక్కల ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లకు చేరింది. 2019 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ దేశం మొత్తమ్మీద నమోదైన జనన, మరణాల లెక్కల ఆధారంగా 2019 డిసెంబరు 31 నాటికి దేశ జనాభా వివరాలను జన గణన విభాగం విడుదల చేసింది. దీని ప్రకారం నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది చనిపోతున్నారు. మరోవైపు, తెలంగాణ జనాభా 3.72 కోట్లు, …
Read More »దేశంలో కొత్తగా 60,471 కరోనా కేసులు
దేశంలో కరోనా రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,471 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ కరోనా కేసులు 75 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొంది. మరో వైపు 1,17,525 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. వైరస్ బారినపడి మరో 2,726 మంది మరణించారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ …
Read More »