Home / NATIONAL / దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కొత్తగా 36,946 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

మరో 422 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,95,958కు పెరిగింది.ఇందులో 3,08,57,467 మంది బాధితులు కోలుకున్నారు.

మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 4,24,773 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 4,13,718 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 47,22,23,639 టీకాలు వేశామని.. గత 24 గంటల్లో 17,06,598 డోసులు వేసినట్లు వివరించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino