అయోధ్యలో సరయూ నదిలో ఓ జంట అనుచితంగా ప్రవర్తించింది. నదిలో పుణ్య స్నానం ఆచరిస్తూ భార్యతో భర్త సరసం ఆడాడు. భార్యకు కిస్సులు ఇవ్వడాన్ని చూసిన జనం ఆ వ్యక్తిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. నదిలో స్నానం చేస్తున్న జనం ఆ భార్యాభర్తలను నిలదీశారు. భార్య వద్ద నుంచి భర్తను లాగేసి చితక్కొట్టారు. భార్య అడ్డుకునే ప్రయత్నం చేసినా అక్కడున్న వారు ఎవరూ వినలేదు. …
Read More »ఘోరం.. ఒకేసారి 9 మంది సూసైడ్!
మహారాష్ట్రంలో ఘోరం జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన 9 మంది మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాంగ్లి జిల్లాలోని అంబికానగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆరుగురి మృతదేహాలు ఒకచోట, మరో ముగ్గురి మృతదేహాలు మరో చోట ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా ఎందుకు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారనే అంశంపై లోతుగా విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గవర్నమెంట్‌హాస్పిటల్‌కి పంపించారు.
Read More »తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు అస్వస్థత
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేలికపాటి జ్వరంతో అస్వస్థత చెందారని ఆ రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్ తెలిపారు. మొన్న శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారని మంత్రి దురైమురుగన్ తెలిపారు. జ్వరం కారణంగా సోమవారం మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యింది. ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో …
Read More »అగ్నిపథ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల
కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీరులను రిక్రూట్ చేసుకునేందుకు ఇండియన్ ఆర్మీ ఈ రోజు సోమవారం నోటిఫికేజన్ జారీ చేసింది. రిక్రూట్మెంట్ ర్యాలీలకు జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది. దీనికి సంబంధించిన ప్రకటన రిలీజ్ చేశారు. రక్షణశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేళ్ల కోసం సైనికుల్ని రిక్రూట్ చేయనున్న విషయం తెలిసిందే. అగ్నిపథ్ ద్వారానానే …
Read More »దేశంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త
రానున్న సంవత్సరకాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,48,463 నియామకాలను పూర్తి చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. గత ఎనిమిదేళ్లలో ఏడాదికి సగటున 43,678 కొత్తగా ఉద్యోగాలిస్తున్నామని వెల్లడించింది. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం 3,49,422 మందికి ఉద్యోగాలిచ్చామ్ము. 2022-23లో మరో 1,48,463 నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది. మోడ్రన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గ్రూప్ సి, డి పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Read More »దేశంలో కొత్తగా 8,822 మందికి కరోనా వైరస్
భారత్ దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా గడిచిన గత 24గంటల వ్యవధిలో 8,822 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. నిన్నటితో పోల్చితే (6,594) పోలిస్తే ఈ రోజు 2,298 కేసులు పెరిగాయి. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 5,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.66 …
Read More »కరోనాపై శుభవార్త
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,594 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో(8,084) పోలిస్తే ఈ రోజు 1490 కేసులు తగ్గాయి. ఇదే సమయంలో వైరస్ నుంచి 4,035 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 50,548 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 195.35 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందించారు.
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో రెండు వారాలుగా కరోనా మహ్మారి మరోసారి కోరలు చాస్తున్నది.దీంతో క్రమంగా రోజువారీ కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వారంలో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8,582 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,32,22,017కు చేరాయి. ఇందులో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. 5,24,761 మంది మరణించారు. మరో …
Read More »మెట్రో స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం..
మెట్రో స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 90 వాహనాలు కాలిపోయాయి. ఢిల్లీలోని జామియా నగర్ మెట్రోస్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణనష్టం మాత్రం జరగలేదు. 10 కార్లు, ఒక బైక్, 80 ఈ-రిక్షాలతో పాటు మరికొన్ని వాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే 11 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేశాయి. మంటలు ఎందుకు వచ్చాయనే విషయంపై పోలీసులు విచారణ …
Read More »భరతమాతకే అవమానం!
‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అని ఓ నానుడి. తొలిదశలో సన్మార్గంలో నడువనది, ఆ తర్వాత ఎలా నడుస్తుందనేది ఆ నానుడి సారాంశం. అలా దారి తప్పిన కొందరు వ్యక్తులు చేసిన తప్పునకు ఇప్పుడు అంతర్జాతీయంగా భారత సమాజం తలదించుకోవాల్సి వస్తున్నది.ఇద్దరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచదేశాలు భారత్ వైపు అనుమానంగా, ఆగ్రహంగా చూస్తున్నాయి. కువైట్, దుబాయ్, ఖతార్, ఒమన్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా తమ దేశాల్లో …
Read More »