ఉత్తరాఖండ్లోని యమకేశ్వర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ మహిళలే గెలుస్తున్నారు. 2002 నుంచి 2012 వరకు బీజేపీ అభ్యర్థి విజయ బర్హ్వాల్ వరుసగా మూడు సార్లు, 2017లో రితూ ఖండూరీ గెలిచారు. ఈసారి బీజేపీ తరఫున రేణు బరిలో ఉండగా, వివిధ పార్టీల నుంచి ఆరుగురు పురుష అభ్యర్థులూ పోటీ పడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.
Read More »దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న Bad News
దేశంలో గత రెండు రోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 40 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 1,192 మంది వైరస్తో మరణించారు. నిన్నటితో పోలిస్తే 250 అధికం. ఇక తాజాగా 2,54,076 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కొత్తగా 2,34,281 మందికి కరోనా
దేశంలో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక రోజులో దేశ వ్యాప్తంగా మొత్తం 2,34,281మంది కరోనా బారీన పడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.10కోట్లకు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా కేసుల్లో ఒక్క యాబై వేల కరోనా కేసులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి. గత ఇరవై నాలుగంటల్లో 893మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4,94,091కి చేరుకుంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,19,396 …
Read More »ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా
టీమిండియాకు చెందిన మాజీ ఓపెనర్ క్రికెటర్, కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని గౌతీ ట్విటర్లో వెల్లడించాడు. తనకు కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. ఇటీవల తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవడంతో పాటు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరాడు. మరోవైపు కొత్త ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కి గంభీర్ మెంటార్ గా …
Read More »‘డోలో 650’ అనే పేరు దానికి ఎలా వచ్చిందో తెలుసా..?
ప్రస్తుతం కరోనా వల్ల ‘డోలో 650’ అనే పేరు ప్రపంచమంతటా మారుమోగుతోంది. ‘డోలో 650’ అనేది బ్రాండ్ పేరు. మందు పారాసెటమాల్. 650 ఎంజీ అంటే డోసు. పీ 650, సుమో ఎల్, పారాసిస్, పాసిమోల్, క్రోసిన్ ఇలా. చాలా పారాసెటమాల్ బ్రాండ్లు ఉన్నప్పటికీ ప్రజలందరికీ సుపరిచితమైంది మాత్రం ‘డోలో 650’. కరోనా మొదటి లక్షణం జ్వరం కావడంతో డాక్టర్లు పారాసెటమాల్ వాడాలని సూచిస్తున్నారు. కానీ ప్రజలకు గుర్తుకొచ్చేది మాత్రం …
Read More »దేశంలో కొత్తగా 3,06,064 మందికి కరోనా
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కరోనా ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 3,06,064 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోల్చితే 27,469 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కాగా పాజిటివిటీ రేటు 17.78శాతం నుంచి 20.75శాతానికి చేరుకుంది. 439 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 22,49,335 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »బీజేపీ కి గుడ్ బై చెప్పేసిన మాజీ సీఎం
గోవాలో బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. నిన్నటికి నిన్నే ఉత్పల్ పర్రీకర్ రాజీనామా చేసిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం, సీనియర్ నేత లక్ష్మికాంత్ పర్సేకర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇకపై పార్టీలో కొనసాగాలని అనుకోవడం లేదని, రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు. రాజీనామా తదనంతరం ఏమిటన్నది తర్వాత ఆలోచించుకుంటానని పర్సేకర్ పేర్కొన్నారు.బీజేపీ ప్రకటించిన జాబితాలో లక్ష్మికాంత్ పర్సేకర్ పేరు లేదు. దీనిపై ఆయన తీవ్ర …
Read More »సీఎం అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా
ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా వేస్తానని పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ తెలిపారు. ఇటీవల చరణ్ సన్నిహితుల ఇంట్లో ఈడీ దాడులు జరగ్గా.. ‘నిజాయితీ లేని వ్యక్తి’ అని కేజీవాల్ విమర్శించారు. దీంతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కేజీవాల్ వ్యాఖ్యానించారని.. ఆయనపై దావా వేస్తానని చరణ్ జిత్ చెప్పారు. గతంలోనూ తప్పుడు ఆరోపణలు చేసి.. కేజీవాల్ క్షమాపణలు …
Read More »గోవా బీజేపీకి షాక్
గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీని వీడారు. తాను ఆశించిన నియోజకవర్గం టికెట్ కేటాయించకపోవడంతో అలకబూనారు. పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడనున్నట్లు వెల్లడించారు. తన తండ్రి పోటీ చేసిన పనాజీ నియోజకవర్గాన్ని సెంటిమెంట్గా భావించి.. అక్కడ నుంచే పోటీ చేస్తున్నట్లు ఉత్పల్ పారికర్ తెలిపారు.
Read More »భారత దేశ ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది-ప్రధాని మోదీ
అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వ నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.’స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మన …
Read More »