Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్న సీఐడీ టీమ్..ఇక దబిడిదిబిడే..!

చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్న సీఐడీ టీమ్..ఇక దబిడిదిబిడే..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ రిమాండ్ నిమిత్తం రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ టీమ్ సినిమా చూపిస్తోంది…ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే తమ కస్టడీలోకి తీసుకున్న 9 మంది సీఐడీ అధికారుల బృందం. ఆయన్ని విచారిస్తోంది. ఈ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు నాన్‌స్టాప్‌గా చంద్రబాబును విచారించనుంది సీఐడీ టీమ్..
విచారణలో ప్రతీ గంటకు 5 నిమిషాల పాటు బ్రేక్‌ ఇస్తారు..బ్రేక్‌ టైమ్‌లో తన న్యాయవాదులతో మాట్లాడేందుకు చంద్రబాబుకు అనుమతి ఇచ్చారు. చంద్రబాబు బ్యారక్‌ ప్రాంతంలోనే ప్రత్యేక గదిలో ఆయ్ని విచారిస్తున్నారు. సీఐడీ టీమ్ విచారణలో ఇద్దరు మధ్యవర్తులు, ఒక ఫొటోగ్రాఫర్‌ కూడా ఉంటారు. ధనుంజయ నేతృత్వంలో ఒక్కో టీమ్‌లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు. చంద్రబాబు సమాధానాలను రికార్డు చేసేందుకు ల్యాప్‌ట్యాప్‌, ప్రింటర్లు సిద్ధం చేశారు. చంద్రబాబు విచారణ తంతు అంతా వీడియో చిత్రీకరణ చేసి కోర్టుకు సమర్పిస్తారు. కాగా చంద్రబాబు తరఫున ఒక న్యాయవాదికే అనుమతి ఇచ్చారు. అలాగే విచారణకు ముందు చంద్రబాబుకు సీఐడీ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు..

కాగా ఏపీ స్కిల్ స్కామ్‌లో ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాలకు అనుగుణంగా సీఐడీ టీమ్ ప్రశ్నలు రెడీ చేసినట్లు తెలుస్తోంది.. స్కిల్ స్కామ్‌లో ఏ తప్పు చేయకపోతే మీ పీఏ శ్రీనివాస్‌ ను ఎందుకు అమెరికాకు పారిపోయేలా చేశారు.. మీ పీఏ శ్రీనివాస్‌కు ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ ఇచ్చిన నోటీసులపై ఏమంటారు? షెల్‌ కంపెనీల ఏర్పాటు వెనక ఎవరెవరు ఉన్నారు? స్కిల్‌ డెవలప్‌మెంట్‌ నిధుల విడుదలకు ఎందుకు తొందరపడ్డారు? అధికారులపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు? కీలకమైన ఫైళ్లు ఎలా మాయమయ్యాయి?చంద్రబాబు ఎక్కడెక్కడ బ్యాంకు ఖాతాలున్నాయి? చంద్రబాబు పేరిట ఏ ఏ కంపెనీలున్నాయి? చంద్రబాబు తరపున ఉన్న బినామీలు ఎవరెవరు? చంద్రబాబు దగ్గర పని చేసిన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ పాత్ర ఏంటీ? ఆర్థిక వ్యవహరాల ప్రతినిధి పెండ్యాల శ్రీనివాస్‌ చౌదరీయేనా? పెండ్యాల శ్రీనివాస్‌కు అమెరికా వెళ్లేందుకు విమాన టికెట్లు ఎవరు తీసుకున్నారు? సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్‌తో ఏ ఏ లావాదేవీలు నిర్వహించారు? డిజైన్టెక్ కంపెనీ అధిపతి ఖన్వేల్కర్‌తో ఉన్న అనుబంధమేంటీ? ఇలా వరుస ప్రశ్నలతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయనున్నారు. బామ్మర్ది బాలయ్య భాషలో చెప్పాలంటే..ఈ రెండు రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాబుగారికి దబిడిదిబిడే అని చెప్పాలి.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat