తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ప్రముఖ భారతీయ దర్శకుడు శంకర్ ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. చెర్రీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. తాజా షెడ్యూల్ ఏపీలోని సముద్రతీరమైన విశాఖపట్నంలో మొదలైంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారనే …
Read More »వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరిగిందని ఉక్రెయిన్ కు చెందిన ప్రముఖ మీడియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ దాడి రెండు నెలల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై జరిగింది. దాని నుంచి ఆయన తప్పించుకున్నారని ఉక్రెయిన్ రక్షణ నిఘా విభాగాధిపతి కైరిలో బుడనోవ్ సంచలన విషయం వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇది జరిగిందని పేర్కొన్నారు. నల్లసముద్రం, కాస్పియన్ …
Read More »మీ ఇంట్లో చిన్నపిల్లలు తినకుండా ఇబ్బంది పెడుతున్నారా..?
మీ ఇంట్లో చిన్నపిల్లలు తినకుండా ఇబ్బంది పెడుతున్నారా..?! అన్నం తినడానికి మారాం చేస్తున్నారా..?.అయితే ఈ చిట్కాలను ఉపయోగిస్తే వాళ్లను దారికి తెచ్చుకోవచ్చు.అన్నం తినిపించవచ్చు.. ♥ పిల్లలు తల్లిదండ్రులనే అనుసరిస్తారు. పెద్దలు తినే వాటినే ఇష్టపడతారు. కాబట్టి.. మీరు తినేటప్పుడే వారికీ తినిపించండి. మీరేం తింటున్నారో అదే వారికి కూడా పెట్టండి. కాకపోతే ఆ ఆహారంలో పోషకాలు తప్పనిసరి. ♥ ఆరు నెలల వయసు నుంచే చిన్నారులకు ఘన పదార్థాలు ఇవ్వవచ్చు. పండ్లు, కూరగాయలను …
Read More »మీ చర్మం మెరవాలా..?
ఈ రోజుల్లో మాటిమాటికీ చర్మం పొడిబారిపోవడం అన్నది చికాకు కలిగించే వ్యవహారమే. ఈ సమస్యకు సోయాబీన్ ఆయిల్‌లో పరిష్కారం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు. ♥ సోయా గింజల నుంచి తీసే ఈ నూనెలో లినోలెయిక్ యాసిడ్లు అధికం. ఇవి చర్మంలోని తేమను నిలిపి ఉంచుతాయి. ఒంట్లో నీటి శాతాన్ని పట్టి ఉంచి, చర్మం పొడిబారకుండా ఫ్యాటీ యాసిడ్లను విడుదల చేస్తాయి. తద్వారా చర్మం మృదువుగా ఉంటుంది. ♥ సోయాబీన్ నూనెను చర్మానికి …
Read More »కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. హనుమాన్ జయంతి సందర్భంగా అర్ధరాత్రి నుంచే అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భారీసంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో కొండగట్టు కాషాయమయమయింది. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్.. హనుమాన్ నామస్మరణతో మారుమోగుతున్నది.
Read More »మంత్రి ఆదిత్య థాకరేతో మంత్రి KTR భేటీ
మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే, మంత్రి కే.టి.ఆర్ ను దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఐటి, లైఫ్ సైన్సెస్, ఫార్మా వంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతి పైన చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య థాకరే ఆసక్తి చూపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం, …
Read More »కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో నిరంజన్ రెడ్డి భేటీ
ఢిల్లీలోని కృషి భవన్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ అయ్యారు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ఆయిల్ ఫామ్ కోసం ప్రాంతీయ పరిశోధన సంస్థ ఏర్పాటుపై నిరంజన్ రెడ్డి తోమర్‌తో చర్చించారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జోగులంబా గద్వాల్, మరికొన్ని జిల్లాల్లో నల్ల తామర తెగులుతో రైతులు నష్టపోయారని తోమర్‌కు వివరించారు. ఈ తెగుళ్లను మార్కెట్లో ఉన్న మందులు …
Read More »ప్రతీ జిల్లాలో రేడియోలజీ ల్యాబ్ – మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 రేడియోలజీ ల్యాబ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నీ రకాల వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రేడియోలజీ హబ్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజాశర్మ, వైస్ చైర్మన్ కనకరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ …
Read More »దేశ వ్యాప్తంగా కొత్తగా 1,675 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,675 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,40,068కి చేరింది. తాజాగా 1,635 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 4,26,00,737 మంది బాధితులు కోలుకున్నారు. మరో 31 మంది వైరస్ బారినపడి మృతి చెందగా.. మొత్తం 5,24,490 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు.
Read More »మహేష్ అభిమానులకు కిక్ ఇచ్చే వార్త
దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత సర్కారు వారి’ పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు.ఈ నెల మే12న విడులైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను తెచ్చుకుంటుంది. మహేష్ కెరీర్‌లో ఈ చిత్రం బిగెస్ట్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు రిజీనల్ చిత్రాలలో వేగంగా 100కోట్ల షేర్‌ను సాధించిన హీరోగా మహేష్ రికార్డు …
Read More »