Tollywood నటసింహం బాలకృష్ణ- హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ ‘అఖండ’. ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఇక, ఈ సినిమా తెలంగాణ, ఏపీలో రూ.46.38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. రెస్టాఫ్ భారత్లో రూ.4.40కోట్లు, ఓవర్సీస్ రూ.2.47 కోట్ల బిజినెస్ జరిగిందట. మొత్తంగా రూ. 53.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. సినిమా బ్రేక్ ఈవెన్ …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హారీష్ రావు Fire
తెలంగాణలో రైతన్నలు పండించే యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని రాష్ట్ర మంత్రి హరీశ్రావు అన్నారు. వరి కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, కిషన్రెడ్డి.. తలోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం తీరు వల్లే రాష్ట్రంలో తడిసిన వరి ధాన్యాన్ని కొనలేకపోతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Read More »లావు తగ్గాలంటే..?
తినాలనే కోరికను తగ్గించుకుంటే.. తక్కువగా తిని బరువు పెరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. 1. బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 2. చిన్న సైజ్ ప్లేట్లో తింటే తక్కువ పరిమాణంలో 3. లంచ్, డిన్నర్లో కాయగూరలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉండాలి. 4. జంక్ ఫుడ్ జోలికి వెళ్లొద్దు. 5. ఎక్కువసార్లు తక్కువ తినేందుకు ప్రయత్నించండి.
Read More »చలికాలంలో ఎక్కువగా నీరు ఎందుకు తాగాలి..?
చలికాలంలో దాహం చాలా మందికి అర్థం కాదు. మనిషికి రోజుకి 4 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో శరీరం పొడిగా ఉంటుంది. ఈ సీజన్లో చాలామందికి తరచూ తలనొప్పి వస్తుంటుంది. చలిలో తిరగడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. శీతాకాలంలో డీహైడ్రేషన్ వల్ల కళ్లలో నొప్పి, శరీరంలో అసౌకర్యం కలుగుతుంది. ఈ లక్షణాలన్నీ కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో.. సాధ్యమైనంత ఎక్కువగా నీరు తాగాలి.
Read More »Twitter CEO కి మంత్రి KTR శుభాకాంక్షలు
మొన్న మైక్రోసాఫ్ట్.. నిన్న గూగుల్.. నేడు ట్విట్టర్. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల సారథ్యంలోకి వస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం, …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో 7 వేల దిగువకు రోజువారీ కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,990 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 190 మంది మరణించారు. మరో 10,116 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,00,543 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 123.25 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసుల పంపిణీ …
Read More »రైతులను శిక్షించ వద్దు..
పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండవరోజు మంగళ వారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ… ధర్నా నిర్వహించారు లోక్ సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల లోక్ సభ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ …
Read More »ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారి-WHO
ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు.. దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సభ్య దేశాలకు అప్రమత్తత లేఖలు జారీ చేసింది. ఇది ప్రపంచమంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలున్నాయని పేర్కొంది. భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను కలిసికట్టుగా పోరాడేందుకు సభ్యదేశాలు ఓ ఒప్పందం చేసుకోవాలని సూచించింది.
Read More »తెలంగాణలో కొత్తగా 184 మందికి కరోనా వైరస్
తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 33,236 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 184 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒకరు మృతి చెందారు. వైరస్ నుంచి 137 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,75,798కి చేరింది. మృతుల సంఖ్య 3,990కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,581 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈమేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
Read More »పుష్ప ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి ఆ Star Hero
Tollywood Youth Icon స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ పుష్ప. డిసెంబర్ 17న రానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను అదే నెల 12న నిర్వహించనున్నారు. భారీ స్థాయిలో జరిపే ఈ ఫంక్షన్కు పుష్ప మేకర్స్ ప్రభాసు అతిథిగా ఆహ్వానించారని తెలుస్తోంది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఈవెంటికి వస్తే.. సినిమాకు కలిసొచ్చే అంశమని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై …
Read More »