తెలంగాణలో రైతన్నలు పండించే యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని రాష్ట్ర మంత్రి హరీశ్రావు అన్నారు.
వరి కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, కిషన్రెడ్డి.. తలోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం తీరు వల్లే రాష్ట్రంలో తడిసిన వరి ధాన్యాన్ని కొనలేకపోతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.