ప్రముఖ సినీనటి జయంతి (76) కన్నుమూశారు. గత రెండేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని స్వగృహంలో మృతి చెందారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, రాజ్కుమార్, రజనీకాంత్ వంటి ప్రముఖులతో నటించిన ఆమె.. కొండవీటి సింహం, బొబ్బిలియుద్ధం, పెదరాయుడు చిత్రాల్లో నటించారు.
Read More »స్పెషల్ సాంగ్ లో మిల్క్ బ్యూటీ తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి స్పెషల్ సాంగ్లో స్టెప్పులేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గని’లో ఆమె ఆడిపాడనుందట. బాక్సింగ్ నేపథ్యంలో ఉండే ఈ చిత్రంలో ఓ మాసీ సాంగ్ను తమన్నాతో చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, KGF-1, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లో ఆమె అదరగొట్టింది.
Read More »తమిళ మూవీతో శ్రీదేవి చిన్నకూతురు ఎంట్రీ
దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో తన కెరీర్ ను కొనసాగిస్తుండగా.. చిన్న కుమార్తె ఖుషీకపూర్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన అక్క జాన్వీ బాటలోనే ఆమె నటిగా అరంగేట్రం చేయడానికి అమెరికాలోని ఓ ఇనిస్టిట్యూట్లో ఇప్పటికే నటన నేర్చుకుంది. ఇప్పటికే ఒక తమిళ కథను బోనీ కపూర్ రెడీ చేశాడని, పైగా సినిమాను కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది.
Read More »ప్రభాస్ కి అరుదైన గౌరవం
ఎన్నో రికార్డులను సృష్టిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని నలువైపులా చాటిచెప్పిన బాహుబలి మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్.. అరుదైన గౌరవం అందుకున్నాడు. ఆసియాలోని మోస్ట్ హ్యాండ్సమ్ మెన్-2021 జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ ఇమ్రాన్ అబ్బాస్(PAK), జిన్ అకానిషి(జపాన్), కిమ్ హ్యూన్(సౌత్ కొరియా), నహన్ ఫాక్ (వియత్నాం), హువాంగ్ జియామింగ్(చైనా), వివియన్ డీసేనా(IND), ఫవాద్ ఖాన్(పాక్), తన్వత్ వట్టనాపుటి (థాయిలాండ్), వట్టనాపుటి(థాయిలాండ్), వాలెస్ హువో(తైవాన్) టాప్-10లో …
Read More »రామప్పకి యునెస్కో గుర్తింపు దక్కడంపై సీఎం కేసీఆర్ హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ దేశానికి మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ విషయంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు తెలిపారు సీఎం. నాడు కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా ఆలయాలు నిర్మించారని, కాకతీయ శిల్పకళా నైపుణ్యం చాలా …
Read More »తెలంగాణలో నేటి నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు.. మిగతా చోట్ల మంత్రులు,ఎమ్మెల్యేలు కార్డులు అందిస్తారు. ఇటీవల వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 3.08 లక్షల కార్డులను ఆమోదించగా, ఆగస్టు నుంచి వీరికి రేషన్ పంపిణీ చేయనున్నారు. తాజా కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 90.50 లక్షలకు చేరింది.
Read More »రూ.2వేల కోట్లు ఇస్తానంటే రాజీనామా చేస్తా- ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు హుజురాబాద్లో రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. మునుగోడు నియోజకవర్గానికి రూ.2వేల కోట్లు ఇస్తానంటే తాను రాజీనామా చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ‘మునుగోడు అభివృద్ధికి ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వట్లేదు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే నిధులు ఇస్తున్నారు. హుజురాబాద్లో అన్ని ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు ఇస్తామన్నారు. మిగతా చోట్ల 100 కుటుంబాలకే ఇస్తామనడం ఏంటి?’ …
Read More »తెలంగాణలో కొత్తగా 494 కొవిడ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 494 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో కరోనాతో నలుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,41,153కు చేరింది. మొత్తంగా 3,784 మంది కరోనా ధాటికి మరణించారు. కొత్తగా 710 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, రికవరీల సంఖ్య 6,27,964కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,405 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »భక్తుల బాధ్యత నాదే.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మహమ్మారితో ఎన్ని కష్టాలు వచ్చినా సంకోచించకుండా ఉత్సవాలను వైభవంగా నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. భక్తులు సంతోషంగా ఉండే విధంగా చూసుకొనే బాధ్యత తనదేనని, ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడుతానన్నారు. కరోనా మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టిందని, …
Read More »యునెస్కో గుర్తింపుపై మంత్రి పువ్వాడ హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్‌కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ …
Read More »