ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో రాణించి అందరి ప్రశంసలు పొందిన సిరాజ్.. తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. సొంతూరు హైదరాబాద్ కు వచ్చిన ఈ పేసర్ తాజాగా BMW కారు కొన్నాడు. తాను తొలిసారి కొన్న కారు ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా ఓ ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు సొంతంగా ఖరీదైన కారు కొన్న సిరాజ కు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read More »తమిళ దర్శకుడితో రామ్
RED తో సంక్రాంతికి పలకరించిన రామ్ తదుపరి సినిమా తమిళ దర్శకుడితో ఉంటుందని తెలుస్తోంది. కొంతకాలం క్రితం ‘జిల్లా’ సినిమా తీసిన | దర్శకుడు ఆర్టీ నీసన్ తో ఓ యాక్షన్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే నీసన్ కలిసి కథ విన్పించగా రామ్ ఇంప్రెస్ అయ్యాడట. దీంతో ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Read More »AR రెహమాన్ వినూత్న నిర్ణయం
దేశంలోని ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్యూచర్ ప్రూఫ్’ పేరుతో కొత్త కార్యక్రమానికి సంగీత దర్శకుడు AR రెహమాన్ శ్రీకారం చుట్టాడు. మన దేశ సృజనాత్మకత, కళాత్మక ఆలోచనలను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని భావించిన ఈ కార్యక్రమం ప్రారంభించానన్నాడు. ప్రతిభావంతులను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టే లక్ష్యంలో కార్యక్రమం తొలి సీజన్ లక్ష్యమని రెహమాన్ తెలిపాడు.
Read More »అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ చేసిన తొలి పని ఏంటో తెలుసా..?
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు, ఇందులో భాగంగా హొజ్లోని అధ్యక్ష కార్యాలయం అయిన ఓవల్ ఆఫీస్లో వైట్ ట్రంప్ ఏర్పాటు చేసిన సోడా బటనను తొలగించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఈ బటన్ ఏర్పాటు చేయించారు. చెక్క బాక్సుపై ఉండే ఎర్రటి బటన్ నొక్కగానే సిబ్బంది ఆయనకు వెంటనే సోడా తీసుకొచ్చి ఇచ్చేవారు.
Read More »ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్
ప్రభాస్ హీరోగా నటించనున్న ‘సలార్’లో హీరోయిన్ పై కొత్త వార్త విన్పిస్తోంది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్లను కాకుండా కొత్త హీరోయిన్ లు తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫిక్సయ్యాడట. కథానుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మోడల్స్ వివరాలను ఆయన పరిశీలిస్తున్నాడట.
Read More »మీ దగ్గర పాత రూ.100 నోట్లు ఉన్నాయా..?
ఈ ఏడాది మార్చి నుంచి పాత రూ.100 నోట్లను ఉపసంహరించనున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది కొత్త రూ. 100 నోట్లు మాత్రమే చలామణీలో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. పాత సిరీస్ నోట్లలో నకిలీ నోట్లు అధికంగా ఉన్నట్లు RBI వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలోనే ఆ నోట్లను రద్దు చేస్తున్నారు. అటు ఇప్పటికే పాత సిరీస్ నోట్ల ముద్రణను 6 నెలలుగా బ్యాంకు ఆపేసింది.
Read More »ఆ హీరోతో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఢీల్.. ఏంటో తెలుసా.?
తెలుగు, హిందీతోపాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం చకచకా సినిమా షూటింగ్‌లకు హాజరవుతోంది. తాజాగా తమిళంలో `అయలాన్` షూటింగ్‌ను కంప్లీట్ చేసింది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరో. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన రకుల్.. శివ కార్తికేయన్ గురించి మాట్లాడింది. `శివ కార్తికేయన్‌తో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేశా. ఆయన చాలా మంచి నటుడు. తమిళంలో …
Read More »జీహెచ్‌ఎంసీ నూతన మేయర్ ఎన్నికకు ముహుర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. ప్రత్యేక సమావేశ౦ నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిని నియమించనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు మెంబర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక …
Read More »టీఆర్ఎస్ లోకి వలసలు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని ఆర్మూరు మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు
Read More »మంత్రి కేటీఆర్ సీఎం కావాలని…!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుతూ మంచిర్యాలకు చెందిన టీఆర్‌ఎస్ యూత్ విభాగం నాయకులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకు న్నారు. శుక్రవారం అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి తిరుమలకు కాలినడక ప్రారంభించారు. కేటీఆర్‌ను సీఎంగా చూడాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకోసమే స్వామికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లినట్టు వారు పేర్కొన్నారు. తిరుమల వెళ్లినవారిలో టీఆర్‌ఎస్ యూత్ …
Read More »