Breaking News
Home / Tag Archives: ys jaganmohan reddy (page 2)

Tag Archives: ys jaganmohan reddy

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు సంచలన నిర్ణయం

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఇచ్చిన జీవోపై విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై కొన్ని ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందుంచాలని ఆదేశించింది. టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read More »

గవర్నర్ కు సీఎం జగన్ పరామర్శ

ఏపీలోని రాజ్ భవన్ కు రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్ దంపతులు వెళ్లారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందను మర్యాదపూర్వకంగా కలిసారు. గవర్నర్ దంపతులు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని గవర్నర్ తెలిపారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా గవర్నరు సూచించారు. కాగా గవర్నర్ దంపతులు కరోనా బారినపడి ఇటీవల కోలుకున్న సంగతి తెలిసిందే.

Read More »

ఏపీ డిప్యూటీ సీఎం కి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ముక్కు నుంచి రక్తస్రావం జరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.

Read More »

పోలవరం పనులు వేగవంతం చేయాలి

ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 20న DDRP (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్వాల్, కోతకు గురైన జెట్ గ్రౌటింగ్ డిజైన్లను ఆమోదించుకోవాలని సూచించారు. డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులను వేగవంతం చేయాలన్నారు.

Read More »

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కి మళ్లీ అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఆయనను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆయన కరోనా బారి న పడి ఈ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.

Read More »

బాబుకు ముద్రగడ ఘాటు లేఖ

ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘మీరు ఏడవడం చూసి ఆశ్చర్యపోయా. మీ కంటే మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. కాపు ఉద్యమ టైంలో దీక్ష చేపట్టిన నన్ను, నా కుటుంబసభ్యులను పోలీసులతో బూతులు తిట్టించారు. మరి మీ శ్రీమతి గారు దేవతా? మీరు చేసిన హింసకు నిద్రలేని రాత్రులు గడిపాం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. …

Read More »

జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయం

ఏపీలో జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఇవాళ అసెంబ్లీలో మరో తీర్మానం తెచ్చే అవకాశం ఉంది. కాగా, గతంలో మండలిలో తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువగా ఉండటంతో దాన్ని రద్దు చేయాలని 2020, జనవరిలో సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు

Read More »

ఏపీ నిరుద్యోగ యువతకు శుభవార్త

ఏపీ వైద్యారోగ్యశాఖ పరిధిలోని బోధన కాలేజీలు, ఆస్పత్రుల్లో 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. https://dme.ap.nic.in/ సైట్ ద్వారా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య విద్య సంచాలకులు డా. రాఘవేంద్రరావు తెలిపారు. 326 పోస్టుల్లో 188 మందిని కొత్తగా నియమిస్తామని.. ఏపీపీవీపీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులతో మిగతా 138 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

Read More »

YSRCP నేతలకు రోహిత్ Warning

స్వార్ధ  రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననం దారుణమని నారా రోహిత్ అన్నారు. ఆదివారం ఆయన నారా వారిపల్లెలో పూర్వీకుల సమాధుల దగ్గర.. నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ ఏనాడూ గడప దాటలేదని, క్రమశిక్షణకు నందమూరి కుటుంబం మారుపేరని అన్నారు. మరోమారు ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం …

Read More »

బాబుకు సూపర్ స్టార్ ఫోన్

ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనల ను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌ శనివా రం ఉదయం చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అనంతరం, ‘నాకు 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై …

Read More »
aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma