Home / NATIONAL / ఆదివారం ఆరో విడత పోలింగ్

ఆదివారం ఆరో విడత పోలింగ్

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగనున్నది. అందులో భాగంగా మొత్త ఏడు రాష్ట్రాల్లోని యాబై నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరగనున్నది. బీహార్ లో ఐదు,జమ్మూకశ్మీర్లో రెండు,జార్ఖండ్ లో నాలుగు,మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు,రాజస్థాన్ రాష్ట్రంలో పన్నెండు,యూపీలో పద్నాలుగు,పశ్చిమ బెంగాల్ లో ఏడు స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనున్నది.

ఆరో విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది అభ్యర్థులు పలు పార్టీల నుండి అభ్యర్థులుగా,స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. అయితే రేపు ఆదివారం పదికోట్ల పదిహేడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు..