సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్ దేవరకొండని టార్గెట్ చేసినట్లు కనబడుతోంది అందుకే ది హంబుల్ కో అంటూ విజయ్ కు మహేశ్ చెక్ పెడుతున్నాడు మహేష్ విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా ? విజయ్ ఇటీవల రౌడీ బ్రాండ్ తో వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.. దాంతో ఈ రౌడీ బ్రాండ్ ఫేమస్ అయ్యింది.. అయితే తాజాగా మహేష్ కూడా ది హంబుల్ కో అనే బ్రాండ్ తో వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.. సహజంగానే విజయ్ కంటే మహేష్ క్రేజ్ చాలా పెద్దది కాబట్టి మొన్నటివరకూ రౌడీ బ్రాండ్ ని కొనుక్కున్న వాళ్లంతా మహేష్ బ్రాండ్ కు మారిపోతున్నారట. మహేశ్ బ్రాండ్ రాగానే విజయ్ రౌడీ బిజినెస్ పడిపోయిందట.. దీంతో మహేష్ కున్న క్రేజ్ తో రౌడీ బ్రాండ్ పెద్ద దెబ్బే పడటం ఖాయమంటున్నారు. అసలే డియర్ కామ్రేడ్ డివైడ్ టాక్ వచ్చి విజయ్ హిట్టో ఫట్టో చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మహేష్ బ్రాండ్ రూపంలో గార్మెంట్స్ కి పెద్ద దెబ్బే తగిలినట్టవుతోంది.