Home / NATIONAL / ప్రధాని మోదీ చేతిలో ఉందేంటో తెలుసా.?

ప్రధాని మోదీ చేతిలో ఉందేంటో తెలుసా.?

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ తమిళనాడులో చెన్నైలోని మామల్లాపురంలో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పి
గ్ తో అనధికార భేటీ జరిపారు.

ఈ క్రమంలో ప్రధాని మోదీ మామల్లాపురం బీచ్ లో ఉన్న చెత్తను ఏరుతూ ఒక వీడియోను తన అధికారక ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేతులో ఒకరోలర్ లాంటి వస్తువు ఉండటం మనం చూసే ఉంటాము.

అయితే తన చేతుల్లో ఏమి ఉందో ప్రధాని మోదీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. దీనిపై స్పందిస్తూ మామల్లపురం బీచ్ లో చెత్త ఏరుతున్నప్పుడు నా చేతుల్లో పరికరం ఏంటని చాలా మంది అడుగుతున్నారు. అది ఆక్యుప్రెజర్ రోలర్.. నేను తరచుగా వాడతాను. నాకు అది ఎంతో మేలు చేస్తుందని”మోదీ ట్విట్టర్లో పోస్టు చేశారు.