Home / LIFE STYLE / మీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా..?

మీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా..?

మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయా..?. నిత్యం ఈ సమస్యతో మీరు తెగ బాధపడుతున్నారా..?. అయితే కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..?. కిడ్నీలో రాళ్లు పోవాలంటే ఏమి ఏమి చేయాలి..?. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్లు ఏమి ఏమి తినాలి..?. అనే పలు అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

అసలు కిడ్నీలో ఆక్సలేట్లు లేదా ఫాస్పరస్ తో కాల్షియం కలవడం వలన రాళ్లు తయారవుతాయి.యూరిక్ ఆసిడ్ అధికంగా ఉన్నా కానీ ఇవి ఏర్పడతాయి. అయితే రాళ్లు రాకుండా ఉండాలంటే .. కిడ్నీలో రాళ్లు పోవాలంటే ప్రతి రోజూ నీళ్ళు బాగా త్రాగాలి. డైలీ కనీసం రెండు లీటర్ల మూత్రం పోవడానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి.

ఎండాకాలంలో మరిన్నీ నీళ్లు,మజ్జీగ,నిమ్మరసం త్రాగాలి.వీటిలో ఉండే సిట్రేట్ కిడ్నీలో రాళ్లు తయారవ్వకుండా నివారిస్తుంది. కాల్షియం ఎక్కువగా లభించే పాలు,పెరుగు,పన్నీరు,చీజ్ తో పాటు అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవాలి.అయితే సప్లిమెంట్ల రూపంలో అధికంగా కాల్షియం తీసుకున్నా కానీ రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది.

యూరిక్ ఆసిడ్ ఉన్నవాళ్లు ఎక్కువగా మాంసాహారం తీసుకోవద్దు.వారానికి రెండు మూడు సార్లు మించి తినవద్దు.రాళ్ళు కరిగే వంతవరకు టమటా తీసుకోవద్దు. సోడియం ఎక్కువగా ఉండే బయట చిరుతిళ్ళు ,బేకరీ ఫుడ్స్ ,రెస్టారెంట్ ఫుడ్ తీసుకోవద్దు. ఫాస్పరస్ అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు.