Home / 18+ / రిలీజ్ కు ముందే పిచ్చెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్..రాంచరణ్ అదుర్స్ !

రిలీజ్ కు ముందే పిచ్చెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్..రాంచరణ్ అదుర్స్ !

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో స్టార్ హీరోలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు.భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కల్పిత కథతో ఈ సినిమాను రాజమౌళి తీస్తున్నాడు. అయితే ఈరోజు మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా తనకి స్పెషల్ గిఫ్ట్ గా ఒక వీడియో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఇది బాగా వైరల్ అవుతుంది. దానికి తోడు దీనికి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ జూనియర్ ఎన్ఠీఆర్ ఇవ్వడంతో మరింత పాపులర్ అయింది.