Home / NATIONAL / పంట రుణాలను తీసుకున్న రైతులకు తీపి కబురు

పంట రుణాలను తీసుకున్న రైతులకు తీపి కబురు

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.అయితే లాక్ డౌన్ కారణంతో దేశంలోని రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది.

ఈ క్రమంలో పంట రుణాలను తీసుకున్న రైతులు మే ముప్పై ఒకటో తారీఖులోగా చెల్లించేలా అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

రూ.3లక్షల లోపు పంట రుణాలను తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరనున్నది.మార్చి 1నుండి మే 31వరకు పంట రుణాలను తీసుకున్న రైతులు ఎలాంటి జరిమానా లేకుండానే చెల్లించవచ్చు..