Home / ANDHRAPRADESH / వేధింపులు తాళ‌లేక విద్యార్థిని ఆత్మహ‌త్య‌.. మ‌రొక‌రు య‌త్నం

వేధింపులు తాళ‌లేక విద్యార్థిని ఆత్మహ‌త్య‌.. మ‌రొక‌రు య‌త్నం

అనంత‌పురంలో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. శార‌దా న‌గ‌ర్‌లో శ్రీ సాయి క‌ళాశాల‌లో య‌మున హాస్ట‌ల్ గ‌దిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. సీఎస్ఈ చ‌దువుతున్న య‌మున దీపావ‌ళి పండుగ‌కు ఇంటికి వెళ్లి వ‌చ్చింది. సెల‌వుల త‌రువాత కాలేజీకి వెళ్లి త‌న‌కు ఒంట్లో బాగోలేదంటూ హాస్ట‌ల్‌కు తిరిగి వ‌చ్చింది. అయితే, రూమ్‌మెంట్స్ వ‌చ్చి చూసే స‌రికి య‌మున ఫ్యాన్‌కు ఉరేసుకుని క‌నిపించింది. తన‌ కూతురు చావుకు కాలేజీ వేధింపులే కార‌ణ‌మ‌ని.. మృతురాలి త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

వ‌రంగ‌ల్‌లో..

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా కాజీపేట ఎన్ఐటీలో ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. చ‌దువుతో ఒత్తిడికి లోనై రాహుల్ త‌న రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. వెంట‌నే తోటి విద్యార్థులు గ‌మ‌నించి వ‌రంగ‌ల్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇంజినీరింగ్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న రాహుల్ ఆరోగ్యం బాగులేద‌ని, మాన‌సికంగా ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని, అందుకే ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్నాడ‌ని క‌ళాశాల యాజ‌మాన్యం చెబుతోంది. కానీ, తోటి విద్యార్థులు మాత్రం చ‌ద‌వుతు భారం మోయ‌లేకే అఘాయిత్యానికి ప్ర‌య‌త్నించాడ‌ని అంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat