ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఏఐసీసీ నాయకురాలు,యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ లేఖ రాయడం ఇటు ఏపీ అటు జాతీయ రాజకీయాల్లో సంచలనం రెకేత్తిస్తుంది.
ఈ నెల ఇరవై మూడున జరిగే దేశంలోని జాతీయ ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల సమావేశానికి రావాలని ఆమె ఆ లేఖలో జగన్ ను కోరారు. అయితే అప్పట్లో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక చాలా మంది మృతి చెందిన సంగతి విదితమే.
అయితే మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చడానికి జగన్ తలపెట్టిన పాదయాత్రను వ్యతిరేకించి మరి అక్రమ కేసులను బనాయించి జైల్లో పెట్టించిన సోనియా గాంధీనే బీజేపీని, మోడీని అదికారంలోకి రాకుండా నిలువరించడం కోసం ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి ఆహ్వానించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది..