గత సాత్వత్రిక ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి,ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మోడీని దించేస్తా..దేశాన్ని ఏకం చేసేస్తా…ప్రదానిని నేనే నిర్ణయిస్తానంటూ ఎన్నికలకిముందు కాంగ్రెస్ తో జట్టుకడుతూ…దేశ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసాడు….
ఒకదశలో “భార్యనే ఏలుకోలేనోడు ఇక ప్రజలనేం పరిపాలించగలడు” అంటూ మోడీపై తీవ్ర విమర్శలకు కూడా తెరలేపాడు….అక్కడితో ఆగకుండా మరో సందర్భంలో “మోడీ నీకు చేతనయ్యింది చేసుకో నేను నిప్పుని… నీకు భయపడేదిలేదు” అంటూ హెచ్చరించాడు కూడా…..ఇంకానోక సందర్భం లో ఒకవేళ బి.జె.పి కి మెజారిటీ స్ధానాలొచ్చినట్టైతే మోడీని కాదంటూ..గడ్కరీని ప్రదానిని చేస్తామని కూడా బాబు తన ఆస్దాన పచ్చపత్రికలో దరువేయించుకున్నాడు….మోసాల మోడీ..అతడొక అపరిచితుడంటూ రాధాకృష్ణకూడా చెలరేగిపోయాడు…నోట్ల రద్దులో అమిత్ షా అవినీతికి పాల్పడ్డాడనీ…అమిత్ షా మీద కూడా ఎన్నో కేసులున్నాయనీ కథనాలమీద కథనాలను అచ్చోసాడు.
?కట్ చేస్తే……??
ఎన్నికలైపోయాయ్…..బాబుగారి పాదమహిమో…సోనియా దరిద్రమో….దేశ ప్రజల చైతన్యమో మొత్తానికి ఏదైతేనేమి….కేంద్రస్దాయిలో కాంగ్రెస్…రాష్ట్రస్ధాయిలో టీడీపీ కొట్టుకుపోయాయ్…..మోడీ భారీ మెజారిటీతో విజయం సాధించాడు.
ఇంకేముంది…ఎప్పటిలానే..”U” టర్న్ తీసుకోవడం లో యుగపురుషుడైన చంద్రబాబు…. తన అవకాశవాద రాజకీయాలకి తెరలేపుతూ…నెలరోజుల్లోనే మోడీపై తన పాత వ్యాఖ్యలనీ….ఆరోపణలనీ…ఒక్కసారిగా దులిపేసుకుంటూ…తన రాజ్యసభ సబ్యులైన సుజనా తదితరులను ఒక్కొక్కరిగా BJP లోనికి పంపడం ద్వారా…తనను తాను కేసులనుండి కాపాడుకునే ఎత్తుగడకు పూనుకున్నాడు….ఒకవైపు తనను తాను కాపాడుకోవడమే కాకుండా…BJP లో తన వర్గాన్ని బలపరుచుకుంటూ….పాత కమళనాధులైన కన్నా..సోము వీర్రాజు..తదితరులను ఓ కుమ్ము కుమ్మడం లో బాబు సఫలమయ్యాడని చెప్పొచ్చు….అలాగే…బి.జె.పి లో రెండు వర్గాలను తయారుచేస్తూ…తన చాణుక్యతను చాటుకుంటున్నాడు.
ఉదాహరణకు….మోడీగారు గతం లో పోలవరం TDP కి ATM లా ఉపయోగపడిందన్నారు…అలాగే కన్నా..సోము వీర్రాజు..జి.వి.యల్ తదితరులంతా ఎన్నికలకి ముందు బాబు దోపిడీలపై దుమ్మెత్తిపోసేవారు.ఒక్కసారిగా ఇప్పుడు బాబు అవినీతిపై సదరు బి.జె.పి మేతలంతా సైలెంటైపోయారంటే…బి.జె.పి లో కూడా బాబు తన బ్యాచ్ తో ఎంతగా చక్రం తిప్పాడోకదా ????
తన హాయాములో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సమీక్షలు జరపరాదనీ…పోలవరం టెండర్లను రద్దు చెయ్యకూడదనీ బల్లగుద్ది వాదించేందుకై బాబు బి.జె.పి లో సుజనా,పురందేశ్వరి ఇలా తన వర్గాన్ని ఎలా విస్తరించుకున్నాడోకదా !??చివరిగా బాబు చాణుక్యతకి ఒకే ఒక్క ఉదాహరణ చెబుతా….పార్లమెంటు ముందు బి.జె.పి విదానాలకి వ్యతిరేకంగా SAVE INDIA అని ప్ల కార్డులు పట్టుకుని నినాదాలిచ్చిన సుజనావంటి ఫ్రాడ్ లీడర్నికూడా…చాకచక్యంగా బి.జె.పి లోనికి ఎలా పంపించాడో చూసారా ???
అబ్బే..ఇది బాబు చాణుక్యత ఎలా ఔతుందీ…బి.జె.పి సిగ్గులేని తనమౌతుందిగానీ అని మీరంటే నేనేమీ చెప్పలేనుసుమా….నిజమే అవ్వచ్చు….పిల్లి గుడ్డిదైతేనేకదా…ఎలుక ఎత్తి చూపుతుంది ?” అని ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.