ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈనెల 28వ తేదీ నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకుటుంబ సమేతంగా హాజరుకావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వాన పత్రికను అందజేశారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ వెంట ఉన్నారు.ఈ సమావేశానికి ఇరు రాష్ర్టాలకు చెందిన పలువురు మంత్రులు, నాయకులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో గోదావరి జలాల తరలింపు, విభజన అంశాలు, ఆర్థిక మాంద్యంతో పాటు తాజా రాజకీయాలపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
