తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శనివారం నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. పిల్లలకు సెలవులు ఇచ్చారని తల్లితండ్రులు ఆనందపడడం కాకుండా వారు గమనించాల్సిన మరియు పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అంశాలు గురించి తెలుసుకోండి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. కాబట్టి చెరువులు,కుంటలు,కాల్వలు,చెక్ డ్యాములు, వాగులు, వంకలు, జలాశయాలు, బావులకు పిల్లలను ఈతకు వెళ్లకుండా ఉండమని చెప్పాల్సిన బాధ్యత మీదే. అంతేకాకుండా కరెంట్ స్తంభాల సపోర్ట్ వైరుకు, బిల్డింగ్ పైన కరెంట్ వైరుకు, బావి దగ్గర కరెంట్ వైరుకు, భూమికి దగ్గరగా వేలాడే కరెంట్ వైరుకు దూరంగా ఉండమని చెప్పి అవగాన కల్పించాలి. ఇది మానవ భాద్యత.
