ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి ,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారా..?. అంటే అవుననే విమర్శిస్తున్నారు అధికార వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్ నాయుడ్ని నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.ఇందుకు చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆయన విరుచుకుపడ్డారు.
అందులో భాగంగానే మొదటి నుండి బీజేపీలో ఉన్న వారిని ఎదగనీయకుండా బాబు అడ్డుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే ఐదేళ్ల పాటు రాజధాని భూములను అలా వదిలేశారని ఆరోపించారు.