Home / NATIONAL / మాజీ సీఎం పడ్నవీస్ రికార్డు

మాజీ సీఎం పడ్నవీస్ రికార్డు

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ లేకపోయిన కానీ ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బీజేఎల్పీ నేత దేవేందర్ పడ్నవీస్. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్ .. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

దీంతో ఒక పక్క ఎన్సీపీ ,శివసేన,కాంగ్రెస్ పార్టీలు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు బీజేపీ ను బలపరీక్షకు సిద్ధమవ్వాలని ఆదేశాలను జారీచేసింది. అంతేకాకుండా కోర్టు మెట్లు ఎక్కిన కాంగ్రెస్,శివసేన,కాంగ్రెస్ లను బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బలనిరూపణ చేసుకోవాల్సిందిగా ఆదేశించింది.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేందర్ పడ్నవీస్ తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి.. బలనిరూపణ చేయడానికి తగినంత మెజారిటీ లేదని తన ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేశారు. ఈ క్రమంలో 59ఏళ్ళ మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో అతి తక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా దేవేందర్ పడ్నవీస్ చరిత్రకెక్కాడు. ఆయన ముఖ్యమంత్రిగా కేవలం 4రోజులంటే నాలుగు రోజులే ఉన్నారు.