కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సిద్ధరామయ్య ఛాతినొప్పితో బాధపడుతున్నారు.దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రిలో చేరారు.
తన తండ్రికి గుండెకు సంబంధించిన సమస్య ఉంది. అందుకే ఆసుపత్రిలో చేర్చాము అని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర సిద్ధరామయ్య తెలిపారు.
సిద్ధరామయ్య గుండెకు రక్తం సరఫరా సరిగా లేకపోవడంతో ప్రస్తుతం ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు..