Home / ANDHRAPRADESH / బెంజి సర్కిల్ వద్ద బాబు హైడ్రామా…రోడ్డుపై బైఠాయింపు…!

బెంజి సర్కిల్ వద్ద బాబు హైడ్రామా…రోడ్డుపై బైఠాయింపు…!

గత 20 రోజులుగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనలను హింసాత్మకంగా మార్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి పై దాడి ఘటన తర్వాత మరో హైడ్రామాకు బాబు తెరలేపారు. విజయవాడలో బెంజి సర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు..అనంతరం సీపీఐ రామకృష్ణ, ఇతర జేఏసీ నేతలతో కలసి ఆటోనగర్‌ వద్ద బస్సు యాత్రను ప్రారంభించేందుకు పాదయాత్రగా బయల్దేరేందుకు సిద్ధమయ్యారు.

అయితే ఎలాంటి అనుమతి తీసుకోకుండా పాదయాత్రగా వెళ్లడానికి వీల్లేదని, సాయంత్రం వేళ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారు. అలాగే బస్సు యాత్రకు కూడా అనుమతి లేదన్న విషయాన్ని పోలీసులు బాబుకు తెలిపారు. ముందు అనుమతి తీసుకుని పాదయాత్ర చేయాలని సూచించారు. దీంతో బాబు హైడ్రామా మొదలుపెట్టారు. .అనుమతి లేకున్నా సరే పాదయాత్రగా ఆటోనగర్ వెళ్లామంటూ పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. నేను మాజీ సీఎంను నన్నే అడ్డుకుంటారా అంటూ పోలీసులపై రంకెలు వేశారు. అయినా పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు, ఇతర నేతలు బెంజిసర్కిల్‌ వద్ద రోడ్డుపైనే బైఠాయించారు. అనుమతి లేకున్నా పాదయాత్ర చేస్తానని రచ్చ చేయడమే కాకుండా..పైగా పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి తమపై దౌర్జన్యం చేస్తున్నారని బాబు ఎదురుదాడి చేశాడు..ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోండి అంటూ పోలీసులను రెచ్చగొట్టారు. పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేసినా వినిపించుకోకుండా మొండిగా రోడ్డుపైనే కూర్చున్నారు. బాబు రోడ్డుపై కూర్చోవడంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెచ్చగొట్టారు.

బాబు డ్రామాతో బెంజి సర్కిల్‌లో గంటన్నర సేపు ట్రాఫిక్ ఎక్కడిక్కడ ఆగిపోయింది. చంద్రబాబుతో పోలీస్ అధికారులు పలుమార్లు చర్చించినా ఫలితం లేకుండా పోయింది. బాబు రోడ్డుపైనే కూర్చుని పాదయాత్ర చేస్తానంటూ మొండిపట్టు పట్టారు. దీంతో పోలీసులు చంద్రబాబు, లోకేష్‌తో సహా జేఏసీ నేతలు, టీడీపీ నేతలను అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు. బాబు, లోకేష్‌లను వారి ఇంటి వద్ద దింపేశారు. మొత్తంగా అనుమతి లేకున్నా..చంద్రబాబు కావాలనే రోడ్డుపై కూర్చుని నానా రాద్ధాంతం చేశాడు. బాబు హైడ్రామాను ఎల్లోమీడియా ఓ రేంజ్‌లో చూపించి మా బాబు అమరావతి కోసం పోరాడుతున్నాడంటూ…బాకాలు వూదాయి. బాబుకు కావాల్సింది అదే..రోజుకో రచ్చ చేసి అమరావతి ఆందోళలను జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని కుట్ర చేస్తున్నాడు. అయితే బాబు ఎన్ని హైడ్రామాలు ఆడినా..రాజధాని గ్రామాల్లో తప్పా..మిగిలిన రాష్ట్రంలో అమరావతి ఆందోళనలకు మద్దతు లేకపోవడం గమనార్హం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat