Home / INTERNATIONAL / ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు

ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు

కరోనా ప్రభావం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 162దేశాల్లో 1,82,609మంది కరోనా వైరస్ బారీన పడ్డారు. ఇందులో 7,171మంది ప్రాణాలు కోల్పోయారు.

అత్యధికంగా చైనా దేశంలో 80,881 కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,226మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇటలీలో 27,980కేసులు నమోదైతే 2,158మంది మృతినొందారు.

ఇరాన్ లో 14,991 కేసులు నమోదైతే 853మరణాలు చోటు చేసుకున్నాయి.స్పెయిన్ లో 9942 కేసులు నమోదైతే 342మరణాలు చోటు చేసుకున్నాయి. సౌత్ కొరియో,జర్మనీ,ఫ్రాన్స్ ,యూఎస్ఏ ,యూకే ,నెదర్లాండ్ లో కేసులు వేలల్లోనే ఉన్నాయి.