Home / NATIONAL / ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం

దేశమంతా కరోనా వైరస్ తో వణికిపోతుంది.ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.ఈక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో వైద్యులకు నాలుగు నెలల జీతాన్ని ముందుగానే ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రభుత్వం జీవోలను విడుదల చేసింది.

మరోవైపు కరోనా వైరస్ బాధితుల చికిత్స కోసం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన నాలుగు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.